క్రెడిట్ కార్డ్ ఫ్రాడ్.. రూ. 7 కోట్లు పోగొట్టుకున్న స్టార్ హీరో..
ABN , Publish Date - May 30 , 2026 | 06:56 AM
హాలీవుడ్ సూపర్ స్టార్ జానీ డెప్ క్రెడిట్ కార్డ్ ఫ్రాడ్‌లో కోట్ల రూపాయలు పోగొట్టుకున్నారు. ఓ సైబర్ నేరగాడు జానీ డెప్ క్రెడిట్ కార్డ్ నుంచి ఏకంగా 6,90,000 డాలర్లు దోచేశాడు.
ఇంటర్‌నెట్ డెస్క్: హాలీవుడ్ సూపర్ స్టార్ జానీ డెప్ క్రెడిట్ కార్డ్ ఫ్రాడ్‌లో కోట్ల రూపాయలు పోగొట్టుకున్నారు. ఓ సైబర్ నేరగాడు జానీ డెప్ క్రెడిట్ కార్డ్ నుంచి ఏకంగా 6,90,000 డాలర్లు దోచేశాడు. అంతర్జాతీయ మీడియా కథనాల మేరకు.. హంగేరియాకు చెందిన ఓ సైబర్ నేరస్థుడు జానీ డెప్‌ను టార్గెట్ చేశాడు. ఆయనకు చెందిన అమెరికన్ ఎక్స్‌ప్రెస్ క్రెడిట్ కార్డు నుంచి డబ్బులు వాడుకోవటం మొదలెట్టాడు. 2024 జనవరి నుంచి 2025 డిసెంబర్ వరకు 308 ట్రాన్సాక్షన్స్ చేశాడు. హోటళ్లలో స్టే చేయడానికి, ఆన్‌లైన్ షాపింగ్స్, చిన్న చిన్న కొనుగోళ్ల కోసం జానీ డెప్ క్రెడిట్ కార్డును వాడేవాడు.
సైబర్ నేరగాడు ఏకంగా 7 కోట్ల రూపాయలు వాడుకున్నాడు. డబ్బులు చిన్న మొత్తంలో పోతుండటంతో జానీ డెప్ దీన్ని గుర్తించలేకపోయారు. అయితే, బ్యాంకు అధికారులు జానీ డెప్ క్రెడిట్ కార్డు నుంచి అనుమానాస్పద లావాదేవీలు జరుగుతుండటం గుర్తించారు. వెంటనే క్రెడిట్ కార్డును ఫ్రీజ్ చేశారు. ఎఫ్‌బీఐ బుడాపెస్ట్ ఆఫీస్‌కు సమాచారం అందించారు. అధికారుల దర్యాప్తులో అంగ్యాల్‌ఫోల్డ్ జిల్లాకు చెందిన ఓ యువకుడు ఈ లావాదేవీలు చేసినట్లు తేలింది. డిజిటల్ ఎవిడెన్స్, ఐపీ అడ్రస్, ఈమెయిల్ అకౌంట్స్, ఫోన్ రికార్డ్స్ ద్వారా అధికారులు నిందితుడిని గుర్తించారు.
మే 6వ తేదీన హంగేరియన్ పోలీసులు యువకుడిని అరెస్ట్ చేశారు. అతడు చేసిన నేరాన్ని పోలీసుల ఎదుట అంగీకరించాడు. తనపై అనుమానం రాకుండా ఉండేందుకు చిన్న చిన్న మొత్తాల్లో మాత్రమే లావాదేవీలు చేసేవాడినని పోలీసులకు చెప్పాడు. ఆ యువకుడికి జానీ డెప్ క్రెడిట్ కార్డు యాక్సెస్ ఎలా లభించిందన్న దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు.
ఇవి కూడా చదవండి
స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే
తిరుమల వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 14 గంటలు