Share News

విదేశాల్లో ఉన్నా వదిలేది లేదు.. హమాస్ నేతలకు ఇజ్రాయెల్ వార్నింగ్..

ABN , Publish Date - Sep 29 , 2026 | 09:34 PM

హమాస్ నేతలకు ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ కీలక హెచ్చరిక చేశారు. హమాస్‌కు చెందిన నేతలు గాజా వెలుపల, ఇతర దేశాల్లో ఉన్నప్పటికీ తాము వదిలిపెట్టబోమని ఆయన హెచ్చరించారు.

విదేశాల్లో ఉన్నా వదిలేది లేదు.. హమాస్ నేతలకు ఇజ్రాయెల్ వార్నింగ్..
Israel Katz

ఇంటర్నెట్ డెస్క్: హమాస్ నేతలకు ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ కీలక హెచ్చరిక చేశారు. హమాస్‌కు చెందిన నేతలు గాజా వెలుపల, ఇతర దేశాల్లో ఉన్నప్పటికీ తాము వదిలిపెట్టబోమని ఆయన హెచ్చరించారు. 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై జరిగిన దాడిలో కీలక పాత్ర పోషించిన హమాస్ నేతలు ప్రశాంతంగా జీవించకూడదని కాట్జ్ వ్యాఖ్యానించారు (Hamas leaders abroad).


హమాస్‌కు చెందిన పలువురు సీనియర్ నేతలు గాజా వెలుపల నివసిస్తున్నారని, వారిపై కూడా చర్యలు తీసుకుంటామని కాట్జ్ తెలిపారు. గాజాలో హమాస్‌ లక్ష్యాలపై ఇజ్రాయెల్ సైనిక చర్యలు కొనసాగుతున్న సమయంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అక్టోబర్ 7 దాడికి బాధ్యులుగా భావిస్తున్న హమాస్ నేతలపై చర్యలు తీసుకోవడం తమ యుద్ధ వ్యూహంలో భాగమని ఇజ్రాయెల్ చెబుతోంది (Israel Hamas war).


2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ భారీ దాడి చేసింది. ఆ దాడిలో సుమారు 1,200 మంది మరణించగా, 251 మందిని హమాస్ బందీలుగా తీసుకెళ్లారు (October 7 attack Hamas). ఈ దాడి తర్వాతే గాజా యుద్ధం ప్రారంభమైంది. గాజాలో ఉన్న హమాస్ స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. అయితే గాజాలో సాధారణ పౌరుల ప్రాణనష్టం, మానవతా పరిస్థితిపై అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.


ఇవి కూడా చదవండి..

అథ్లెటిక్స్‌లో భారత్‌కు తొలి స్వర్ణం.. 4x400 మీటర్ల రిలేలో అదరగొట్టిన అమ్మాయిలు..


శ్రీ చరణి సంచలనం.. అత్యధిక రేటింగ్ పాయింట్లు సాధించి రికార్డ్..

Updated Date - Sep 29 , 2026 | 09:34 PM