మా వేలు ఇంకా ట్రిగ్గర్‌పైనే ఉంది ఐఆర్‌జీసీ
ABN , Publish Date - Apr 09 , 2026 | 06:20 AM
కాల్పుల విరమణ అంశంలో అమెరికా ఇచ్చిన హామీపై తమకు విశ్వాసం లేదని ఐఆర్‌జీసీ స్పష్టం చేసింది. సుప్రీంలీడర్ ఆదేశాల మేరకు...
కాల్పుల విరమణ అంశంలో అమెరికా ఇచ్చిన హామీపై తమకు విశ్వాసం లేదని ఐఆర్‌జీసీ స్పష్టం చేసింది. సుప్రీంలీడర్ ఆదేశాల మేరకు ప్రస్తుతానికి దాడులు నిలిపివేసినా.. తమ వేలు తుపాకీ ట్రిగ్గర్‌పైనే ఉందని పేర్కొంది. ఈ మేరకు ఐఆర్‌జీసీ టెలిగ్రామ్ చానల్‌లో ప్రకటన చేసింది. ‘‘శత్రువులు ఎలాంటి దాడి చేసినా మేం మరింత తీవ్ర స్థాయిలో ప్రతిస్పందిస్తాం’’ అని పేర్కొంది. గల్ఫ్ దేశాలు అమెరికాకు సహకారం అందించడాన్ని ఆపేయాలంది. కాల్పుల విరమణ నేపథ్యంలో ఇరాన్ సైన్యాలు దాడులు ఆపాలని ఆ దేశ సుప్రీంలీడర్ మొజ్తాబా ఖమేనీ ఆదేశించారు. అయితే ఇది యుద్ధానికి ముగింపు కాదని ఓ ప్రకటనలో స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి..
ట్రంప్ గుడ్ న్యూస్.. దేశీయ సూచీలకు ఫుల్ జోష్..
ఇరాన్‌కు మరో రెండు వారాల గడువు.. డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం..