Share News

అమెరికాకు షాక్.. US MQ-1 డ్రోన్‌ను కూల్చేసిన ఇరాన్

ABN , Publish Date - May 31 , 2026 | 10:05 AM

అమెరికాకు చెందిన US MQ-1 డ్రోన్‌ను కూల్చేశామని ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్‌జీసీ) ప్రకటించింది. ఆదివారం తెల్లవారుజామున ఇరాన్ ఎయిర్ స్పేస్‌లోకి ప్రవేశించిన డ్రోన్‌ను ఎయిర్ డిఫెన్స్ యూనిట్స్ ధ్వంసం చేశాయని తెలిపింది.

అమెరికాకు షాక్.. US MQ-1 డ్రోన్‌ను కూల్చేసిన ఇరాన్
IRGC drone attack

టెహ్రాన్, మే 31: అమెరికాకు చెందిన US MQ-1 డ్రోన్‌ను కూల్చేశామని ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్‌జీసీ) ప్రకటించింది. ఆదివారం తెల్లవారుజామున ఇరాన్ ఎయిర్ స్పేస్‌లోకి ప్రవేశించిన డ్రోన్‌ను ఎయిర్ డిఫెన్స్ యూనిట్స్ ధ్వంసం చేశాయని తెలిపింది. ఇరానియన్ న్యూస్ ఏజెన్సీ తస్నిమ్ తెలిపిన వివరాల మేరకు.. ఇరాన్ భూభాగంలోకి వచ్చిన US MQ-1 డ్రోన్‌ను ఐఆర్‌జీసీ సర్వేలెన్స్‌లు, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ వెంటనే గుర్తించాయి. దాన్ని భద్రతా దళాలు అధునాతనమైన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ను ఉపయోగించి పేల్చేశాయి. ఈ విషయాన్ని ఇరాన్ అధికారులు ధ్రువీకరించారు. ఆ డ్రోన్ యూఎస్ ఆర్మీకి చెందినదని తెలిపారు. దాడులు చేసే ఉద్దేశ్యంతోనే ఆ డ్రోన్ ఇరాన్ భూభాగంలోకి వచ్చిందని అన్నారు.


కాగా, హోర్ముజ్ జలసంధి విషయంలో ఇరాన్, అమెరికా దేశాల మధ్య పోరు కొనసాగుతోంది. హోర్ముజ్‌ జలసంధి ప్రాంతంలో ఇరాన్‌ నౌకాశ్రయాలపై దిగ్బంధాన్ని అమెరికా కొనసాగిస్తోంది. దిగ్బంధాన్ని ఉల్లంఘించిన నౌకలపై దాడులకు పాల్పడుతోంది. తాజాగా, దిగ్బంధనాన్ని ఉల్లంఘించేందుకు ప్రయత్నించిన ఓ కార్గో నౌకపై అమెరికా క్షిపణి దాడి చేసింది. గాంబియా జెండా కలిగిన ఆ కార్గో నౌక ఇరాన్ పోర్ట్ వైపు ప్రయాణిస్తుండగా అమెరికా హెల్‌ఫైర్ క్షిపణిని ప్రయోగించింది.


దిగ్బంధం ఎత్తివేతపై ట్రంప్ పోస్ట్..

హోర్ముజ్‌ జలసంధి ప్రాంతంలో ఇరాన్‌ నౌకాశ్రయాలపై అమెరికా కొనసాగిస్తున్న దిబ్బంధనాన్ని త్వరలోనే ఎత్తివేయబోతున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు. ఆ ప్రాంతంలో మోహరించిన తమ యుద్ధ నౌకలను ఉపసంహరిస్తామని శుక్రవారం తెలిపారు. ఈ మేరకు తన సొంత సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ‘ది ట్రూత్ సోషల్’లో ఓ పోస్టు పెట్టారు.


ఇవి కూడా చదవండి

గాజు సీసాలో మ్యాజికల్‌ గార్డెన్‌

మరోసారి రెచ్చిపోయిన వైసీపీ మూకలు.. కత్తులతో రైతుపై దాడికి యత్నం..

Updated Date - May 31 , 2026 | 10:49 AM