Share News

నిరాశ్రయులైన 30 లక్షల మంది ఇరానీయులు

ABN , Publish Date - Mar 15 , 2026 | 06:49 AM

యుద్ధం కారణంగా ఒక్క ఇరాన్‌లోనే 30 లక్షల మందికి పైగా నిరాశ్రయులయ్యారు. ఈ విషయాన్ని ఐక్యరాజ్యసమితి శరణార్థి సంస్థ (యూఎన్‌హెచ్‌సీఆర్‌) వెల్లడించింది....

నిరాశ్రయులైన 30 లక్షల మంది ఇరానీయులు

జెనీవా, మార్చి 14: యుద్ధం కారణంగా ఒక్క ఇరాన్‌లోనే 30 లక్షల మందికి పైగా నిరాశ్రయులయ్యారు. ఈ విషయాన్ని ఐక్యరాజ్యసమితి శరణార్థి సంస్థ (యూఎన్‌హెచ్‌సీఆర్‌) వెల్లడించింది. యుద్ధ భయంతో రాజధాని టెహ్రాన్‌ తదితర నగరాలు, పట్టణాల నుంచి ప్రజలు అధిక సంఖ్యలో గ్రామీణ ప్రాంతాలకు వలస పోతున్నారని ఆ సంస్థ తెలిపింది. మరోవైపు లెబనాన్‌లో కూడా ఏడు లక్షలకు పైగా నిరాశ్రయులయ్యారని, వారిలో అత్యధికులు ప్రభుత్వ ఆశ్రయాల్లో తలదాచుకుంటున్నారని యూఎన్‌హెచ్‌సీఆర్‌ పేర్కొంది. యుద్ధం మరికొన్నాళ్లు కొనసాగితే పరిస్థితి మరింత దారుణంగా తయారయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఇదిలా ఉండగా, కొచ్చి తీరంలో నిలిచిపోయిన ఇరాన్‌ యుద్ధ నౌక ఐరిస్‌ లావన్‌కు చెందిన అత్యవసరం కాని సిబ్బందిని భారత్‌ స్వదేశానికి తరలించింది. టర్కిష్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానంలో దాదాపు 130 మంది భారత్‌ నుంచి తిరుగు ప్రయాణమయ్యారు. ఐరిస్‌ లావన్‌లో ఇంకా 50మందికి పైగా ఇక్కడే ఉండిపోయారు.

ఇవి కూడా చదవండి...

గ్యాస్‌ సరఫరాపై సీఎం చంద్రబాబు ఫోకస్.. మంత్రులతో చర్చ

కేంద్రమంత్రి అన్నపూర్ణా దేవితో మంత్రి సీతక్క భేటీ.. చర్చించిన అంశాలివే

Updated Date - Mar 15 , 2026 | 06:49 AM