Share News

పెళ్లింటిపై దాడి చేస్తారా? యూఎస్‌పై భగ్గుమన్న ఇరాన్ సుప్రీం లీడర్

ABN , Publish Date - Sep 02 , 2026 | 08:29 AM

మంగళవారం రాత్రి అమెరికా దాడులు చేయడంతో ఇరాన్ కూడా ప్రతీకార దాడులకు దిగింది. ఇందుకు సంబంధించి ఇరాన్ మీడియాలో పలు కథనాలు వెలువడ్డాయి.

పెళ్లింటిపై దాడి చేస్తారా? యూఎస్‌పై భగ్గుమన్న ఇరాన్ సుప్రీం లీడర్
Iran Retaliatory Strikes

ఇంటర్నెట్ డెస్క్: మంగళవారం రాత్రి అమెరికా దాడులు చేయడంతో ఇరాన్ కూడా ప్రతీకార దాడులకు దిగింది. ఇందుకు సంబంధించి ఇరాన్ మీడియాలో పలు కథనాలు వెలువడ్డాయి. ఇరాక్, జోర్డాన్‌‌పై ఇరాన్ ప్రత్యేక సైనిక దళం ఐఆర్‌జీసీ దాడి చేసింది. కువైత్, బహ్రెయిన్‌లో కూడా పేలుళ్లు సంభవించాయి. సిరిక్ ప్రాంతంలో అమెరికా దాడి వల్ల ఓ పెళ్లింట విషాదం సంభవించిందని ఇరాన్ మీడియా పేర్కొంది. ఓ చిన్నారి సహా నలుగురు మృతి చెందారని, 50 మంది గాయపడ్డారని తెలిపింది.

ఈ ఉదంతంపై ఇరాన్ సుప్రీం లీడర్ మండిపడ్డారు. యూఎస్‌కు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. యూఎస్‌కు తమ సైన్యం మర్చిపోలేని గుణపాఠం చెబుతుందని ఐఆర్‌జీసీ ప్రతినిధి హుస్సేన్ మొహబి పేర్కొన్నారు. ఈ దాడులు ఎందుకు చేశామా? అని చింతించేలా చేస్తామని హెచ్చరించారు. అయితే, హోర్ముజ్‌లో కమర్షియల్ నౌకలపై ఇరాన్ దాడి చేసే ప్రయత్నం చేయడంతోనే తాము దాడులు చేయాల్సి వచ్చిందని యూఎస్ సెంట్రల్ కమాండ్ తెలిపింది. మంగళవారం అర్ధరాత్రి నుంచి బుధవారం తెల్లవారుజాము వరకూ దాడులు కొనసాగాయని పేర్కొంది.


ఇక తమ భూభాగం వైపు వస్తున్న 13 బాలిస్టిక్ మిసైల్స్‌ను మార్గమధ్యంలోనే ధ్వంసం చేశామని జోర్డాన్ మిలిటరీ పేర్కొంది. మరో మూడు మిసైల్స్ నిర్మానుష్య ప్రాంతంలో కూలిపోయాయని తెలిపింది. ఇరాన్ దాడుల వల్ల ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని చెప్పింది. బుధవారం ఉదయం ఇరాన్ ప్రయోగించిన పలు మిసైల్స్‌ను అడ్డుకున్నామని మరో ప్రకటనలో కువైట్ తెలిపింది. బహ్రెయిన్‌లో కూడా పేలుళ్లు సంభవించినట్టు తెలిసింది.

అమెరికా దాడుల్లో చిన్నారి మరణించినట్టు ఇరాన్ మీడియాలో వార్తలు రావడంపై యూఎస్ సెంట్‌కామ్ ప్రతినిధి స్పందించారు. ఇరాన్ దళాల లాగా తాము సామాన్య పౌరులను ఏనాడు టార్గెట్ చేయలేదని స్పష్టం చేశారు.


ఈ వార్తలనూ చదవండి:

ఉక్రెయిన్‌పై రష్యా దాడిలో జగిత్యాల వాసి మృతి

వియన్నా మ్యూజియంలో భారీ దోపిడీ.. రూ.38 కోట్ల విలువైన వజ్రాల హారం చోరీ..

Updated Date - Sep 02 , 2026 | 10:47 AM