Share News

హోర్ముజ్‌పై పట్టు వీడని ఇరాన్‌

ABN , Publish Date - Apr 09 , 2026 | 06:11 AM

నలభై రోజుల భీకర దాడుల అనంతరం అమెరికా చేసిన తాత్కాలిక కాల్పుల విరమణ ప్రకటన పశ్చిమాసియా ప్రాంతంలో ఇరాన్‌ను బలహీనం చేయడానికి...

హోర్ముజ్‌పై పట్టు వీడని ఇరాన్‌

(ఆంధ్రజ్యోతి గల్ఫ్‌ ప్రతినిధి)

నలభై రోజుల భీకర దాడుల అనంతరం అమెరికా చేసిన తాత్కాలిక కాల్పుల విరమణ ప్రకటన పశ్చిమాసియా ప్రాంతంలో ఇరాన్‌ను బలహీనం చేయడానికి బదులుగా బలోపేతం చేసిందని రక్షణ రంగ నిపుణులు భావిస్తున్నారు. ఎన్నో దశాబ్దాలుగా ఎలాంటి ఇబ్బందీలేకుండా హోర్ముజ్‌ జలసంధి గుండా సాఫీగాసాగిన నౌకాయానం తాజా యుద్ధంతో స్తంభించిపోగా.. టోల్‌ వసూళ్ల ప్రతిపాదన ద్వారా ఇరాన్‌ దానిపై పూర్తి పెత్తనం కోరుకునే స్థాయికి చేరడం అమెరికా వైఫల్యమేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. హోర్ముజ్‌ గుండా రాకపోకలు సాగించే ఒక్కో నౌకకూ 20లక్షల డాలర్ల చొప్పున టోల్‌ వసూలు చేయాలన్నది ఇరాన్‌ ఆలోచనగా చెబుతున్నారు. ఈ మార్గం గుండా రోజుకు సగటున 120నుంచి140 దాకా నౌకలు వెళ్తాయి. తద్వారా ఏడాదికి ఇరాన్‌కు సుమారు 87బిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.8లక్షలకోట్లు) ఆదాయం వస్తుంది. ఇది ఇరాన్‌ ఏడాదికి చమురు ఎగుమతి ద్వారా సంపాదించే 50బిలియన్‌ డాలర్ల (రూ.4.61 లక్షల కోట్లు)కంటే చాలా ఎక్కువ.

ఇవి కూడా చదవండి..

ట్రంప్ గుడ్ న్యూస్.. దేశీయ సూచీలకు ఫుల్ జోష్..

ఇరాన్‌కు మరో రెండు వారాల గడువు.. డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం..

Updated Date - Apr 09 , 2026 | 06:11 AM