ఇరాన్ యుద్ధంలో కీలక పరిణామం.. గాల్లోనే కూలిపోయిన ఎఫ్-15 ఫైటర్ జెట్..
ABN , Publish Date - Mar 02 , 2026 | 12:52 PM
పశ్చిమాసియాలో ఉద్రికత్తలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. ఇరాన్, అమెరికా మద్దతు కలిగిన ఇజ్రాయెల్ మధ్య దాడులు, ప్రతిదాడులు మూడో రోజుకు చేరుకున్నాయి. యుద్ధం ప్రారంభమైన మొదటి రోజే ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణించడం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
పశ్చిమాసియాలో ఉద్రికత్తలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. ఇరాన్, అమెరికా మద్దతు కలిగిన ఇజ్రాయెల్ మధ్య దాడులు, ప్రతిదాడులు మూడో రోజుకు చేరుకున్నాయి. యుద్ధం ప్రారంభమైన మొదటి రోజే ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణించడం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఖమేనీ మృతికి ప్రతీకారంగా ఇరాన్ కూడా దాడులు ప్రారంభించింది (Kuwait airspace incident).
ఇజ్రాయెల్‌తో పాటు అమెరికా వైమానిక స్థావరాలున్న గల్ఫ్ దేశాలపై కూడా ఇరాన్ క్షిపణి దాడులకు దిగింది. యూఏఈ, కువైట్, బహ్రెయిన్, ఖతార్ తదితర దేశాల్లోని అమెరికా బేస్‌లపై దాడులు చేసింది. కాగా, సోమవారం శత్రు దేశానికి చెందిన ఓ ఫైటర్ జెట్‌ను కూల్చివేసినట్టు ఇరాన్ ప్రకటించింది. కువైట్ గగనతలంలో ఎగురుతున్న ఒక ఎఫ్-15 ఫైటర్ జెట్‌ను తమ క్షిపణి వ్యవస్థతో కూల్చివేసినట్లు వెల్లడించింది. దీనికి సంబంధించిన వీడియోను కూడా ఇరాన్ విడుదల చేసింది (F-15 fighter jet crash).
వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ యుద్ధ విమానం మంటల్లో చిక్కుకుని నెమ్మదిగా కిందకు పడిపోతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి (Iran-US-Israel tensions). అయితే ఈ విమానం అమెరికాదా లేక ఇజ్రాయెల్‌దా అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. పైలెట్లు ఇద్దరూ పారాచూట్ల సాయంతో క్షేమంగా బయటపడినట్లు వార్తలు వస్తున్నాయి. అలాగే, ఈ యుద్ధం ఆపేందుకు మధ్యవర్తులతో ఇరాన్ సంప్రదింపులు జరుపుతోందంటూ వస్తున్న వార్తలను ఇరాన్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శి అలీ లరిజానీ ఖండించారు. అమెరికాతో చర్చల ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.
ఇవి కూడా చదవండి..
కోల్‌కతాలో సంజూ వీర విహారం.. దాసోహమైన రికార్డులివే..
స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..