శత్రువులకు నో ఎంట్రీ.. ట్రంప్ 48 గంటల డెడ్‌లైన్‌పై స్పందించిన ఇరాన్
ABN , Publish Date - Mar 22 , 2026 | 06:53 PM
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హోర్ముజ్ జలసంధి విషయంలో ఇరాన్‌కు 48 గంటల డెడ్‌లైన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ డెడ్‌లైన్‌పై ఇరాన్ ఆదివారం స్పందించింది. శత్రుదేశాలకు మాత్రమే హోర్ముజ్ జలసంధిని మూసి వేశామని స్పష్టం చేసింది.
టెహ్రాన్, మార్చి 22: పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఆయిల్, గ్యాస్ కష్టాలు తీవ్రతరం అయ్యాయి. హోర్ముజ్ జలసంధిలో రాకపోకలు పాక్షికంగా దెబ్బతినటంతో క్రూడ్ ఆయిల్ సంక్షోభం నెలకొంది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హోర్ముజ్ జలసంధి విషయంలో ఇరాన్‌కు 48 గంటల డెడ్‌లైన్ ఇచ్చారు. ఈ డెడ్‌లైన్‌పై ఇరాన్ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ.. ‘మా శత్రుదేశాలకు మాత్రమే హోర్ముజ్ జలసంధిని మూసి వేశాము. మిగిలిన దేశాలు హోర్ముజ్ మీదుగా వెళ్లాలంటే భద్రతపై ఇరాన్ అధికారులను సంప్రదించవచ్చు’ అని అన్నారు.
ఇంతకీ ట్రంప్ ఎమన్నారంటే.. హోర్ముజ్ జలసంధిని 48 గంటల్లోగా పునరుద్ధరించాలని, లేదంటే ఇరాన్ విద్యుత్ కేంద్రాలను నేలమట్టం చేస్తామని ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. అతిపెద్ద కేంద్రం నుంచే ఈ దాడులు మొదలవుతాయని ట్రంప్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన తన సొంత సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ‘ది ట్రూత్’లో శనివారం ఓ పోస్టు పెట్టారు.
ఎఫ్ 15 ఫైటర్ జెట్‌ను కూల్చేసిన ఇరాన్
హోర్ముజ్ ఐల్యాండ్‌లో శత్రువులకు సంబంధించిన ఎఫ్ 15 ఫైటర్ జెట్‌ను కూల్చేశామని ఇరాన్ తెలిపింది. ఆదివారం టెహ్రాన్ టైమ్స్ ఇందుకు సంబంధించిన ఓ వీడియోను ఎక్స్ ఖాతాలో విడుదల చేసింది. 29 సెకన్ల ఆ వీడియోలో ఇరాన్ దళాలు హోర్ముజ్ ఐల్యాండ్‌పై ఎఫ్ 15 ఫైటర్ జెట్‌ను గుర్తించి పేల్చిసిన దృశ్యాలు ఉన్నాయి. అయితే, ఆ ఫైటర్ జెట్ అమెరికాకు చెందినది లేదా ఇజ్రాయెల్‌కు చెందినదా అన్నది తెలియరాలేదు. ఇరాన్ కూడా దీనిపై క్లారిటీ ఇవ్వలేదు.
ఇవి కూడా చదవండి
ప్రధాని మోదీ అరుదైన రికార్డ్.. అభినందనలు తెలిపిన సీఎం చంద్రబాబు
ఐపీఎల్ 2026: వారి బ్యాటింగ్ అదుర్స్.. కానీ టైటిల్ మాత్రం గెలవడం కష్టం: రాబిన్ ఉతప్ప