Share News

ఇరాన్‌ ప్రాధేయపడినందుకే విరమణ హెగ్సెత్‌

ABN , Publish Date - Apr 09 , 2026 | 06:18 AM

కాల్పుల విరమణ కోసం ఇరాన్‌ ప్రాధేయపడిందని, అందుకే అధ్యక్షుడు ట్రంప్‌ అంగీకరించారని అమెరికా రక్షణ మంత్రి...

ఇరాన్‌ ప్రాధేయపడినందుకే విరమణ హెగ్సెత్‌

వాషింగ్టన్‌, ఏప్రిల్‌ 8: కాల్పుల విరమణ కోసం ఇరాన్‌ ప్రాధేయపడిందని, అందుకే అధ్యక్షుడు ట్రంప్‌ అంగీకరించారని అమెరికా రక్షణ మంత్రి పీట్‌ హెగ్సెత్‌ వ్యాఖ్యానించారు. ఇరాన్‌పై చేపట్టిన ఆపరేషన్‌ ఎపిక్‌ ఫ్యూరీ యుద్ధ క్షేత్రంలో అమెరికా మిలిటరీ సాధించిన చరిత్రాత్మక విజయమని అభివర్ణించారు. అధ్యక్షుడు ట్రంప్‌ దీనిని సుసాధ్యం చేశారన్నారు. ఈ ఆపరేషన్‌తో ఇరాన్‌ మిలిటరీ ఇప్పట్లో కోలుకోలేనంతగా నాశనం చేశామని పేర్కొన్నారు. ఇరాన్‌ వద్ద ఉన్న శుద్ధి చేసిన యురేనియంను అమెరికా స్వాధీనం చేసుకుంటుందని చెప్పారు. ఇరాన్‌ స్వచ్ఛందంగా ఇస్తే సరేనని, అవసరమైతే ఆపరేషన్‌ మిడ్‌నైట్‌ హ్యామర్‌ తరహాలో బలప్రయోగంతోనైనా సరే స్వాధీనం చేసుకుంటామని వ్యాఖ్యానించారు. మరోవైపు, పాకిస్థాన్‌ వేదికగా అమెరికా-ఇరాన్‌ ప్రత్యక్ష చర్చలపై ఇంకా ఏమీ ఖరారు కాలేదని అమెరికా అధ్యక్ష కార్యాలయం వైట్‌హౌజ్‌ ప్రతినిధి కరోలిన్‌ లీవిట్‌ తెలిపారు.

ఇవి కూడా చదవండి..

ట్రంప్ గుడ్ న్యూస్.. దేశీయ సూచీలకు ఫుల్ జోష్..

ఇరాన్‌కు మరో రెండు వారాల గడువు.. డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం..

Updated Date - Apr 09 , 2026 | 06:18 AM