Share News

కాల్పుల విరమణ ఉన్నా ఆగని దాడులు

ABN , Publish Date - Apr 09 , 2026 | 06:15 AM

అమెరికా-ఇరాన్‌ కాల్పుల విరమణ ప్రకటించినా బుధవారం పరస్పర దాడులు ఉధృతంగా కొనసాగాయి. తమ దేశంలోని ఒక...

కాల్పుల విరమణ ఉన్నా ఆగని దాడులు

టెహ్రాన్‌/దుబాయ్‌, ఏప్రిల్‌ 8: అమెరికా-ఇరాన్‌ కాల్పుల విరమణ ప్రకటించినా బుధవారం పరస్పర దాడులు ఉధృతంగా కొనసాగాయి. తమ దేశంలోని ఒక చమురు రిఫైనరీతోపాటు పలు ప్రాంతాలపై దాడులు జరిగినట్టు ఇరాన్‌ వెల్లడించింది. మరోవైపు గల్ఫ్‌ దేశాలపై ఇరాన్‌ క్షిపణి, డ్రోన్‌ దాడులు కొనసాగాయి. కాల్పుల విరమణ ప్రకటన జరిగిన వెంటనే అమెరికా సైన్యం దాడులు నిలిపివేసిందని, ఇజ్రాయెల్‌ దాడులు కొనసాగుతున్నాయని అమెరికా సైనికాధికారి ఒకరు తెలిపారు. ఇరాన్‌లోని లావన్‌ దీవిలో ఉన్న చమురు, గ్యాస్‌ ఎగుమతి వ్యవస్థలపై ఇజ్రాయెల్‌ క్షిపణి దాడులు చేసింది. ఇస్ఫహాన్‌, కరజ్‌ పట్టణాల్లోనూ వైమానిక దాడులతో భారీగా పేలుళ్లు జరిగాయి. మరోవైపు సౌదీలోని కీలకమైన ఈస్ట్‌-వెస్ట్‌ చమురు పైప్‌లైన్‌పై దాడి జరిగింది. తమ దేశంపైకి బుధవారం 17 క్షిపణులు, 35 డ్రోన్లు దూసుకువచ్చినట్టు యూఏఈ రక్షణ శాఖ ప్రకటించింది. అబుధాబిలోని హబ్షాన్‌ గ్యాస్‌ కాంప్లెక్స్‌లో డ్రోన్‌ దాడితో మంటలు చెలరేగాయి. దానిని తాత్కాలికంగా మూసివేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. కొన్ని గంటల్లోనే 28 డ్రోన్లు దూసుకువచ్చాయని, వాటిని రక్షణ వ్యవస్థలతో అడ్డుకున్నామని కువైట్‌ అధికారులు వెల్లడించారు. బహ్రెయిన్‌పైనా ఇరాన్‌ దాడులు కొనసాగాయి.

ఇవి కూడా చదవండి..

ట్రంప్ గుడ్ న్యూస్.. దేశీయ సూచీలకు ఫుల్ జోష్..

ఇరాన్‌కు మరో రెండు వారాల గడువు.. డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం..

Updated Date - Apr 09 , 2026 | 06:15 AM