ఇండోనేసియాలో ఓడకు మంటలు..ఐదుగురి మృతి
ABN , Publish Date - Aug 03 , 2026 | 06:23 AM
ఇండోనేసియాలోని మదుర ద్వీపం సమీపంలో ఓ ప్రయాణికుల ఫెర్రీ (భారీ ఓడ) అగ్ని ప్రమాదానికి గురైంది...
41 మంది గల్లంతు.. 225 మంది సురక్షితం
జకార్తా, ఆగస్టు 2: ఇండోనేసియాలోని మదుర ద్వీపం సమీపంలో ఓ ప్రయాణికుల ఫెర్రీ (భారీ ఓడ) అగ్ని ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా.. మరో 41 మంది గల్లంతయ్యారు. 225 మంది సురక్షితంగా బయటపడ్డారు. ఆదివారం ఉదయం సురబయాలోని తంజుంగ్ పేరాక్ పోర్టు నుంచి దక్షిణ సులవేసి ద్వీపంలోని మకాస్సార్‌కి కేఎంపీ ముటియారా సెంటోసా-2 అనే ఫెర్రీ బయలుదేరింది. అందులో ప్రయాణికులు, సిబ్బంది కలిపి మొత్తం 271 మంది ఉన్నారు. అయితే కొన్ని గంటల్లోనే ఆ ఫెర్రీకి మంటలంటుకున్నాయి. ప్రమాదం జరిగిన వెంటనే సురబయా సెర్చ్ అండ్ రెస్క్యూ ఆఫీస్, సమీపంలోని నౌకలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి. మధ్యాహ్నానికి 225 మందిని సురక్షితంగా కాపాడినట్లు అధికారులు తెలిపారు.
ఈ వార్తలనూ చదవండి:
ఇండోనేషియాలో ఘోర అగ్నిప్రమాదం.. ఐదుగురి మృతి, 41 మంది గల్లంతు..
వాషింగ్టన్‌లో భారీ కార్చిచ్చు.. 2.5 లక్షల ఎకరాలు దగ్ధం..