Share News

ముంచుతున్న యుద్ధం.. భారీగా పతనమైన దేశీయ సూచీలు..

ABN , Publish Date - Mar 23 , 2026 | 03:44 PM

ఇరాన్ యుద్ధం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లన్నీ నష్టాల బాటలోనే సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో సెన్సెక్స్, నిఫ్టీ కూడా భారీ నష్టాలను చవిచూశాయి. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ (93.97) జీవనకాల కనిష్ఠానికి పడిపోయింది.

ముంచుతున్న యుద్ధం.. భారీగా పతనమైన దేశీయ సూచీలు..
Indian stock marke

డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ (93.97) జీవనకాల కనిష్ఠానికి పడిపోయింది. మరోవైపు బ్రెంట్ క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 112.9 డాలర్లకు చేరుకుంది. యుద్ధం ఇలాగే కొనసాగితే ఏప్రిల్ చివరి నాటికి బ్యారెల్ చమురు ధర 180 డాలర్లు దాటుతుందనే అంచనాలు వినబడుతున్నాయి. అలాగే విదేశీ సంస్థాగత మదుపర్లు గత 16 ట్రేడింగ్ సెషన్లలో దాదాపు రూ.లక్ష కోట్ల విక్రయాలకు పాల్పడ్డారు. అంటే గంటకు దాదాపుగా రూ.1000 కోట్ల చొప్పున అమ్మకాలు సాగించారు. ఈ యుద్ధం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లన్నీ నష్టాల బాటలోనే సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో సెన్సెక్స్, నిఫ్టీ కూడా భారీ నష్టాలను చవిచూశాయి (Indian stock market).


గత సెషన్ ముగింపు (74,532)తో పోల్చుకుంటే సోమవారం ఉదయం దాదాపు 800 పాయింట్ల నష్టంతో మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత మరింత కిందకు దిగజారింది. రోజంతా నష్టాల్లోనే కదలాడింది. చివరకు సెన్సెక్స్ 1836 పాయింట్ల నష్టంతో 72,696 వద్ద రోజును ముగించింది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడింది. చివరకు 601 పాయింట్ల నష్టంతో 22,512 వద్ద స్థిరపడింది. ఐటీ రంగ షేర్లు స్వల్ప లాభాలను ఆర్జించాయి (stock market news today).


సెన్సెక్స్‌, నిఫ్టీలో హెచ్‌సీఎల్ టెక్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, కోఫోర్జ్, పెర్సిస్టెంట్, ఇన్ఫోసిస్ స్వల్ప లాభాలు ఆర్జించాయి (share market news). లోథా డెవలపర్స్, సెయిల్, పెట్రోనాట్ ఎల్‌ఎన్‌జీ, భారత్ డైనమిక్స్, ఐనాక్స్ విండ్ మొదలైన షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి. బ్యాంక్ నిఫ్టీ 1989 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 2137 పాయింట్లు దిగజారింది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 93.97గా ఉంది.


ఇవి కూడా చదవండి..

క్షిపణిపై శాంతి సందేశం.. ఇజ్రాయెల్‌ పైకి ప్రయోగించిన ఇరాన్..


మీ కళ్లు షార్ప్ అయితే.. ఈ పులుల మధ్యనున్న జీబ్రాను 10 సెకెన్లలో కనిపెట్టండి..

Updated Date - Mar 23 , 2026 | 03:48 PM