కెనడాలో భారత సంతతి హత్య వెనుక గ్యాంగ్ వార్.. పోలీసుల అంచనా
ABN , Publish Date - Jan 25 , 2026 | 12:46 PM
కెనడాలో ఇటీవల జరిగిన భారత సంతతి వ్యక్తి హత్య వెనుక గ్యాంగ్ వార్ ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితులను పట్టుకునేందుకు దర్యాప్తును ముమ్మరం చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: ఇటీవల కెనడాలో భారత సంతతి వ్యక్తి హత్యకు గ్యాంగ్ వార్ కారణమైన ఉండొచ్చని స్థానిక పోలీసులు అనుమానిస్తున్నారు. వాంకూవర్‌కు చెందిన భారత సంతతికి యువకుడు దిల్‌రాజ్ సింగ్ గిల్ (22) జనవరి 22న హత్యకు గురయ్యాడు (Indian Origin Man Shot Dead in Canada).
కెనడావేలోని 3700 బ్లాక్ వద్ద సాయంత్రం సాయంత్రం 5.30 ఘటన సమయంలో కాల్పుల కలకలం రేగింది. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులకు గిల్ గాయాల పాలై అచేతన స్థితిలో కనిపించాడు. అక్కడికి కొద్ది దూరంలో మంటల్లో కాలిపోతున్న ఓ కారును కూడా పోలీసులు గుర్తించారు.
ఈ రెండు ఘటనలకు సంబంధం ఏదైనా ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే, ఈ హత్యకు గ్యాంగ్ వార్ కారణమై ఉంటుందని పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. మరిన్ని ఆధారాలు సేకరించేందుకు ప్రయత్నిస్తున్నారు.
‘పబ్లిక్ ప్లేస్‌లో కాల్పులు చోటుచేసుకోవడం ఆందోళనకం. పోలీసులతో పాటు స్థానికులకు ఆందోళన కలిగిస్తోంది. అసలేం జరిగిందో తెలిసిన వారు ముందుకొస్తే దర్యాప్తు త్వరిత గతిన పూర్తవుతుంది’ అని స్థానిక అధికారులు తెలిపారు.
స్థానిక మీడియా కథనాల ప్రకారం, బీకే గ్యాంగ్‌కు, యూఎన్ గ్యాంగ్‌కు మధ్య వైరం కొనసాగుతోంది. ఈ క్రమంలో బీకే గ్యాంగ్‌కు చెందిన నవ్‌ప్రీత్ సింగ్ ధలీవాల్ గత నెలలో హత్యకు గురయ్యాడు. తాజాగా యూఎన్ గ్యాంగ్‌తో సంబంధాలున్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న గిల్ హత్యకు గురయ్యాడు. గిల్‌కు నేర చరిత్ర ఉన్నట్టు కూడా స్థానిక మీడియాలో కథనాలు వెలువడ్డాయి. 2016 నాటి పలు కేసులతో పాటు 2021 నాటి డ్రగ్స్ సంబంధిత కేసులో గిల్ దోషిగా తేలాడు.
ఇవీ చదవండి:
హెచ్-1బీ వీసాదారులకు మరో షాక్! ఇక ఇంటర్వ్యూలు వచ్చే ఏడాదే..
పావు గంటే టైమిచ్చారు.. లేకపోతే చంపేస్తామన్నారు: వెనెజువెలా అధ్యక్షురాలు