Share News

ఇద్దరు భారత జర్నలిస్టులకు పులిట్జర్‌

ABN , Publish Date - May 06 , 2026 | 06:00 AM

భారత జర్నలిస్టులు ఆనంద్‌ ఆర్కే, సుపర్ణ శర్మ ప్రతిష్ఠాత్మక పులిట్జర్‌ అవార్డును గెలుచుకున్నారు. డిజిటల్‌ నిఘా, సైబర్‌ మోసాలు...

ఇద్దరు భారత జర్నలిస్టులకు పులిట్జర్‌

న్యూయార్క్‌, మే 5: భారత జర్నలిస్టులు ఆనంద్‌ ఆర్కే, సుపర్ణ శర్మ ప్రతిష్ఠాత్మక పులిట్జర్‌ అవార్డును గెలుచుకున్నారు. డిజిటల్‌ నిఘా, సైబర్‌ మోసాలు, డిజిటల్‌ అరెస్టులపై వారు ప్రజల్లో అవగాహన పెంచడానికి చేసిన కృషికి గాను వారికి ఈ బహుమతి లభించింది. ‘వివరణాత్మక రిపోర్టింగ్‌, వ్యాఖ్యానం’ విభాగంలో వీరిద్దరికి ఈ అవార్డును ప్రకటించారు. ఆనంద్‌, సుపర్ణతో పాటు బ్లూమ్‌బర్గ్‌ వార్తా సంస్థ రిపోర్టర్‌ నటాలీ ఒబికో కూడా ఇదే విభాగంలో పులిట్జర్‌ బహుమతికి ఎంపికయ్యారు. అంటే ముగ్గురికి కలిపి ఈ అవార్డును ప్రకటించారు. వీరు ముగ్గురు సంయుక్తంగా బ్లూమ్‌బర్గ్‌ కోసం రాసిన ‘ట్రాప్‌డ్‌’ అనే వార్తా కథనం రాశారు. కాగా, కొలంబియా యూనివర్సిటీ పులిట్జర్‌ బహుమతులను అందజేస్తుంది. జర్నలిజం, సాహిత్యంలో దీనికి అత్యున్నత అవార్డుగా భావిస్తారు.

ఇవి కూడా చదవండి:

‘టెస్టు ప్లేయర్’ అనే ముద్రను చెరిపేసుకోవడం గర్వంగా ఉంది: కేఎల్ రాహుల్

ఆటకు డబ్బుతో సంబంధమే లేదు.. పంత్ ఆటతీరుపై ఎల్ఎస్‌జీ కోచ్ రియాక్షన్

Updated Date - May 06 , 2026 | 06:00 AM