Share News

గ్యాస్, ఆయిల్ కష్టాలు తీరినట్లే.. హోర్ముజ్‌లో కొత్త మార్గం ద్వారా రవాణా..

ABN , Publish Date - Apr 04 , 2026 | 12:30 PM

ఇరాన్ అనుమతించిన మార్గంలో వెళ్లటం ద్వారా ఇబ్బందులు తప్పవని ఇండియాతో పాటు పలు దేశాలు భావించాయి. ఈ నేపథ్యంలోనే కొత్త మార్గం ద్వారా నౌకలను రవాణా చేస్తున్నాయి. ఒమనీ టెర్రిటోరియల్ వాటర్స్ ద్వారా నౌకలను తమ దేశాలకు తీసుకెళుతున్నాయి.

గ్యాస్, ఆయిల్ కష్టాలు తీరినట్లే.. హోర్ముజ్‌లో కొత్త మార్గం ద్వారా రవాణా..
Strait of Hormuz news

టెహ్రాన్, ఏప్రిల్ 4: ఇరాన్ - ఇజ్రాయెల్, అమెరికా దేశాల మధ్య యుద్ధం కారణంగా పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఆయిల్, గ్యాస్ సరఫరాలో తీవ్ర ఆటంకం ఏర్పడింది. స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ మార్గం నుంచి ఇండియాకు రవాణా కావాల్సిన నౌకలు యుద్ధం కారణంగా అక్కడే ఆగిపోయాయి. అయితే.. భారత్, ఇరాన్ దేశాల మధ్య స్నేహ సంబంధాలు ఉండటంతో స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్‌లో నిలిచిపోయిన నౌకల్ని సురక్షితంగా పంపడానికి ఇరాన్ ఒప్పుకుంది. సాధారణ మార్గం నుంచి కాకుండా.. ఓ ప్రత్యేక మార్గాన్ని ఇరాన్ తెరపైకి తెచ్చింది.


ఆ మార్గం నుంచి మిత్ర దేశాలు తమ నౌకల్ని రవాణా చేసుకోవడానికి అనుమతి ఇచ్చింది. ఇప్పుడిప్పుడే అక్కడి పరిస్థితుల్లో మార్పులు వస్తున్నాయి. ఇప్పటి వరకు 7 భారతీయ నౌకలు స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ మార్గంనుంచి సురక్షితంగా ఇండియాకు చేరుకున్నాయి. కానీ, ఇంకా 17 భారతీయ నౌకలు స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ పశ్చిమ భాగంలో నిలిచిపోయి ఉన్నాయి. ఇందులో గ్యాస్, ముడి చమురు మోసుకెళ్తున్న ట్యాంకర్లు ఉన్నాయి. ఇరాన్ అనుమతించిన మార్గంలో వెళ్లటం ద్వారా ఇబ్బందులు తప్పవని ఇండియాతో పాటు పలు దేశాలు భావించాయి.


ఈ నేపథ్యంలోనే కొత్త మార్గం ద్వారా నౌకలను రవాణా చేస్తున్నాయి. ఒమనీ టెర్రిటోరియల్ వాటర్స్ ద్వారా నౌకలను తమ దేశాలకు తీసుకెళుతున్నాయి. ప్రస్తుతం ఇండియాకు చెందిన ఒక నౌకతో పాటు వేరే దేశాలకు చెందిన మరో మూడు నౌకలు కొత్త మార్గం ద్వారా తమ దేశానికి ప్రయాణం అయ్యాయి. ఆ నౌకల్లో లక్షల టన్నుల ఆయిల్, ఎల్ఎన్‌జీ ఉన్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 3వ తేదీన ఆ నౌకలు మస్కట్‌ తీరానికి 350 కిలోమీటర్ల దూరంలో కనిపించినట్లు ఏఎస్ఐ, రిమోట్ సెన్సింగ్ డేటా అనాలసిస్ ద్వారా తెలియవచ్చింది.


ఇవి కూడా చదవండి

హీరో అజిత్‌ అభిమానుల ఓట్ల కోసం..

సీఐడీ ముందుకు పాడి కౌశిక్ రెడ్డి.. విచారణ ప్రారంభం

Updated Date - Apr 04 , 2026 | 12:53 PM