Share News

బ్యాంకుకు వెయ్యి కోట్ల మేర టోకరా.. ఎన్‌ఆర్‌ఐ అరెస్టు

ABN , Publish Date - Jun 12 , 2026 | 05:58 AM

బ్యాంకును 100 మిలియన్‌ డాలర్ల (సుమారు 1,000 కోట్లు) మేర మోసగించిన ఇండియన్‌-అమెరికన్‌ మహేంద్ర మఖిజానీ (44)ని కాలిఫోర్నియా..

బ్యాంకుకు వెయ్యి కోట్ల మేర టోకరా.. ఎన్‌ఆర్‌ఐ అరెస్టు

వాషింగ్టన్‌, జూన్‌ 11: బ్యాంకును 100 మిలియన్‌ డాలర్ల (సుమారు 1,000 కోట్లు) మేర మోసగించిన ఇండియన్‌-అమెరికన్‌ మహేంద్ర మఖిజానీ (44)ని కాలిఫోర్నియా పోలీసులు అరెస్టు చేశారు. గ్రీన్‌కార్డు హోల్డర్‌ అయిన ఆయన బీమా పాలసీల్లో అక్రమాలకు పాల్పడడంతోపాటు బ్యాంకులను మోసగించినట్టు కేసు నమోదయింది. బుధవారం ఆయనను అరెస్టు చేశారని, నేరం రుజువయితే గరిష్ఠంగా 30 ఏళ్ల జైలు శిక్ష పడనుందని న్యాయవాదులు తెలిపారు. ఆయన కాంటోర్‌ గ్రూపు పేరుతో కంపెనీని నిర్వహిస్తుంటారు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం నిమిత్తం ఓ బ్యాంకు 100 మిలియన్‌ డాలర్లు అడ్వాన్సుగా ఇవ్వగా డొల్ల కంపెనీల పేరుతో వాటిని దుర్వినియోగం చేసినట్టు కేసు నమోదయింది.

ఇవి కూడా చదవండి..

పెరిగిన క్రూడాయిల్ ధరలు.. సూచీలకు నష్టాలు..

మాతో ఉంటారా.. అభిషేక్‌తో ఉంటారా.. మమతకు కల్యాణ్ బెనర్జీ అల్టిమేటం..

Updated Date - Jun 12 , 2026 | 05:58 AM