హూతీ దాడుల్లో ఇద్దరు భారతీయులకు గాయాలు.. ఖండించిన విదేశాంగ శాఖ
ABN , Publish Date - Nov 25 , 2026 | 12:25 PM
: సౌదీ అరేబియాపై నిన్న యెమెన్ దేశ మిలిటెంట్ గ్రూప్ హూతీలు జరిపిన దాడిని భారత విదేశాంగ శాఖ ఖండించింది. పౌర, ఆర్థిక మౌలికవసతులపై దాడులు చేయడాన్ని వెంటనే కట్టిపెట్టాలని తేల్చి చెప్పింది.
ఇంటర్నెట్ డెస్క్: సౌదీ అరేబియాపై నిన్న యెమెన్ దేశ మిలిటెంట్ గ్రూప్ హూతీలు జరిపిన దాడిని భారత విదేశాంగ శాఖ ఖండించింది. పౌర, ఆర్థిక మౌలికవసతులపై దాడులు చేయడాన్ని వెంటనే కట్టిపెట్టాలని తేల్చి చెప్పింది. ఈ దాడిలో ఇద్దరు భారతీయులు గాయపడినట్టు కూడా విదేశాంగ శాఖ ధ్రువీకరించింది. నవంబర్ 24 సౌదీలోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లోగల ఓ బహుళ అంతస్తుల భవనంపై ఈ దాడి జరిగింది.
ఈ నేపథ్యంలో సౌదీ అరేబియాకు భారత్ సంఘీభావం తెలిపింది. ఇలాంటి దాడులు సామాన్య పౌరులకు, ప్రాంతీయ సుస్థిరతకు ముప్పుగా మారతాయని ఆందోళన వ్యక్తం చేసింది. సౌదీ అరేబియా సార్వభౌమన్ని ఉల్లంఘించడమేనని స్పష్టం చేసింది. వీటిని తక్షణం కట్టిపెట్టాలని డిమాండ్ చేసింది. భారతీయ కుటుంబాలకు సౌదీలోని భారతీయ ఎంబసీ అన్ని రకాలుగా సాయం చేస్తుందని చెప్పింది.
అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం, డ్రోన్లతో హూతీలు ఈ దాడులు చేశారు. ఈ ఘటనలో 11 మంది గాయపడ్డారు. బాధితుల్లో భారతీయులతో పాటు ఇద్దరు సౌదీ జాతీయులు, ముగ్గురు నేపాలీలు, నలుగురు ఈజిప్టు పౌరులు ఉన్నారు. నేడు కూడా హూతీల దాడులను అడ్డుకున్నామని సౌదీ వర్గగాలు తెలిపాయి. హూతీల డ్రోన్లను మార్గమధ్యంలోనే కూల్చేశామని తెలిపాయి.
ఈ వార్తలనూ చదవండి:
టర్కీలో ఘోర హెలికాప్టర్ ప్రమాదం.. ఐదుగురు సైనికుల మృతి
1200 ట్రక్కులు.. 42 కి.మీ. క్యూ!