1200 ట్రక్కులు.. 42 కి.మీ. క్యూ!
ABN , Publish Date - Nov 25 , 2026 | 04:25 AM
ఇక్కడున్న ఫొటోలో పాములా మెలికలు తిరిగిన లైన్‌లో కనిపిస్తున్నవన్నీ.. అట్టపెట్టెలు కాదు. అక్షరాలా 1200 ట్రక్కులు. ఇరాన్ ఓడరేవులపై అమెరికా..
ఇరాన్ ఓడరేవులను అమెరికా దిగ్బంధించడంతో రోడ్డు మార్గంలో రవాణా.. భారీగా ట్రాఫిక్‌జామ్
ఇంటర్నెట్ డెస్క్: ఇక్కడున్న ఫొటోలో పాములా మెలికలు తిరిగిన లైన్‌లో కనిపిస్తున్నవన్నీ.. అట్టపెట్టెలు కాదు. అక్షరాలా 1200 ట్రక్కులు. ఇరాన్ ఓడరేవులపై అమెరికా నౌకా దిగ్బంధం విధించడంతో.. చైనా నుంచి తనకు కావాల్సిన సరుకులను ఇరాన్ భూమార్గంలో దిగుమతి చేసుకుంటోంది. అలా బయల్దేరినవే ఈ ట్రక్కులన్నీ. కజకిస్థాన్-ఉజ్బెకిస్థాన్ సరిహద్దుల్లో యలామా క్రాసింగ్ వద్ద కస్టమ్స్ తనిఖీల కారణంగా 42 కిలోమీటర్ల భారీ ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకుని నత్తనడకన నిదానంగా కదులుతున్నాయి. మామూలుగా అయితే సముద్ర మార్గంలో చైనా నుంచి ఇరాన్‌కు ఒక్కో కంటెయినర్ రవాణా ఖర్చు దాదాపు రూ.2.8 లక్షలు అవుతుంది. అదే భూమార్గంలో రూ.11 లక్షలకు పైగానే అవుతోంది.