ఆపరేషన్ సిందూర్‌లో పాక్ ఆర్మీ ఓటమి.. మాజీ ప్రధాని సోదరి ఆరోపణ
ABN , Publish Date - Jul 18 , 2026 | 09:51 PM
పాక్ మాజీ ప్రధాని, పీటీఐ అధినేత ఇమ్రాన్ ఖాన్ సోదరి నోరీన్ నియాజీ తాజాగా సంచలన ఆరోపణలు చేశారు. ఆపరేషన్ సిందూర్ సందర్భంగా ఎదురైన ఓటమిని పాక్ ఆర్మీ దాచిపెట్టి పరువు కాపాడుకుందని ఇటీవల ఆరోపించారు.
ఇంటర్నెట్ డెస్క్: పాక్ మాజీ ప్రధాని, పీటీఐ అధినేత ఇమ్రాన్ ఖాన్ సోదరి నోరీన్ నియాజీ తాజాగా సంచలన ఆరోపణలు చేశారు. ఆపరేషన్ సిందూర్‌లో పాక్ ఆర్మీకి వ్యూహాత్మక ఓటమి ఎదురైందని ఆరోపించారు. దేశ ప్రజల ముందు పరువు పరువుపోకుండా ఉండేందుకు తాము గెలిచామంటూ తప్పుడు వార్తలు వ్యాపింపజేసిందని అన్నారు. అంతేకాకుండా, తమ ఓటమిని దాచి పెట్టేందుకు దౌత్య మార్గాల్లో విస్తృత ప్రయత్నాలు చేసిందని చెప్పారు. యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జోక్యంతోనే పాక్ ఆర్మీ ఘోర అవమానం నుంచి తప్పించుకోగలిగిందని అన్నారు.
అమెరికా సాయం కోసం పాక్ చాలా హామీలు ఇవ్వాల్సి వచ్చిందని కూడా చెప్పుకొచ్చారు. ఇజ్రాయెల్, ఇతర గల్ఫ్ దేశాల మధ్య శాంతిస్థాపన కోసం ఉద్దేశించిన అబ్రహామ్ అకార్డ్స్‌పై సంతకం చేస్తామని, ఇజ్రాయెల్‌ను దేశంగా గుర్తిస్తామని పాక్ ఆ చీఫ్ ఆసిమ్ మునీర్ హామీ ఇవ్వాల్సి వచ్చిందని కూడా చెప్పారు. భారత సాయుధ దళాలను ఎదుర్కొనే సామర్థ్యం పాక్ మిలిటరీకి లేదని కూడా నియాజీ చెప్పారు. సాంకేతికంగా, ఆర్థికంగా, ఆయుధ సంపత్తి పరంగా భారత సైన్యం పాక్ కంటే నాలుగు రెట్లు పెద్దదని కూడా అన్నారు. ఈ ఆరోపణలు పాక్‌లో ప్రస్తుతం ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.
ఈ వార్తలనూ చదవండి:
శాంతి ఒప్పందానికి కట్టుబడి ఉండబోము: ఇరాన్
'రక్తానికి రక్తం'.. ట్రంప్ కుటుంబమే లక్ష్యంగా ఇరాన్ భారీ బ్యానర్లు!