Hindu Man Run Over: బంగ్లాదేశ్‌లో దారుణం.. కారు ఎక్కించి హిందువు హత్య..
ABN , Publish Date - Jan 18 , 2026 | 08:28 PM
బంగ్లాదేశ్‌లో హిందువులపై దారుణాలు బాగా పెరిగాయి. అక్కడ హిందువుల సంఖ్య రోజురోజుకూ బాగా క్షీణిస్తోంది. రెండు నెలల కాలంలో 15 మంది దాకా హిందువులు దారుణ హత్యకు గురయ్యారు..
బంగ్లాదేశ్‌లో హిందువులపై దారుణాలు ఆగడం లేదు. రెండు నెలల కాలంలో 15 మంది దాకా హిందువులు దారుణ హత్యకు గురయ్యారు. తాజాగా, పెట్రోల్ పంప్ దగ్గర ఘోరం చోటుచేసుకుంది. ఇద్దరు దుండగులు రిపన్ సాహా అనే హిందువును కారుతో తొక్కించి చంపేశారు. పెట్రోల్ కొట్టించుకుని డబ్బులు ఇవ్వకుండా పారిపోతున్న వారిని అడ్డుకున్నందుకు ఈ దారుణానికి ఒడిగట్టారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. గోవాలంద ఏరియాలో కరీమ్ ఫిల్లింగ్ స్టేషన్ ఉంది. 30 ఏళ్ల రిపన్ సాహా ఆ పెట్రోల్ పంపులో పని చేస్తున్నాడు.
శుక్రవారం నాలుగున్నర గంటల ప్రాంతంలో బ్లాక్ ఎస్‌యూవీ పెట్రోల్ బంకు దగ్గరకు వచ్చింది. రిపన్ సాహా కారులో రూ.3,710 పెట్రోల్ కొట్టాడు. అయితే, డబ్బులు ఇవ్వకుండా కారుతో పారిపోయే ప్రయత్నం చేశారు. దీంతో రిపన్ సాహా కారుకు అడ్డంగా వెళ్లాడు. కారును ఆపే ప్రయత్నం చేశాడు. కారులోని దుర్మార్గులు రిపన్ మీద ఏ మాత్రం జాలిచూపలేదు. కారుతో తొక్కించి చంపేశారు. తర్వాత అక్కడి నుంచి పరారయ్యారు. తీవ్రంగా గాయపడ్డ రిపన్ అక్కడికక్కడే చనిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ దారుణానికి పాల్పడ్డ ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. వారిని అబ్దుల్ హాసెమ్, కమల్ హుస్సేన్‌లుగా గుర్తించారు. అబ్దుల్ గతంలో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‌పీ) రాజబరీ జిల్లాకు ట్రెజరర్‌గా పని చేశాడు. పోలీసులు వారి కారును సీజ్ చేశారు. బంగ్లాదేశ్‌లో హిందువులపై దారుణాలు బాగా పెరిగాయి. అక్కడ హిందువుల సంఖ్య రోజు రోజుకు బాగా క్షీణిస్తోంది. 2022లో 13.13 మిలియన్ల మంది హిందువులు ఉండేవారు. ఇప్పుడు ఆ సంఖ్య 7.95 మిలియన్లకు చేరింది.
ఇవి కూడా చదవండి..
అథర్వ తైడే సెంచరీ.. సౌరాష్ట్ర లక్ష్యం 318
రైతు కూలీల కోసం చట్టాలను అమలు చేసింది కాంగ్రెస్: సీఎం రేవంత్