Rising Attacks On Minority: బంగ్లాదేశ్‌లో హిందువులపై ఆగని మారణకాండ.. మరో హిందువు దారుణ హత్య
ABN , Publish Date - Jan 13 , 2026 | 07:58 AM
హిందువులే టార్గెట్‌గా బంగ్లాదేశ్‌లో హత్యలు జరుగుతున్నాయి. తాజాగా, సమీర్ దాస్ అనే యువకుడిని గుర్తు తెలియని దుండుగులు దాడి చేసి చంపేశారు. ఈ సంఘటన చిట్టగ్యాంగ్‌లోని దగన్‌బుయ్యాలో చోటుచేసుకుంది..
పొరుగు దేశం బంగ్లాదేశ్‌లో హిందువులపై దారుణాలు ఆగడం లేదు. దీపు చంద్రదాస్ హత్యతో మొదలు పెట్టి ఇప్పటి వరకు ఏకంగా 11 మంది హిందువులు హత్యకు గురయ్యారు. అది కూడా కేవలం 35 రోజుల కాలంలో ఇంత మంది బలయ్యారు. హిందువులే టార్గెట్‌గా బంగ్లాదేశ్‌లో హత్యలు జరుగుతున్నాయి. తాజాగా, సమీర్ దాస్ అనే యువకుడిని గుర్తు తెలియని దుండుగులు దాడి చేసి చంపేశారు. ఈ సంఘటన చిట్టగ్యాంగ్‌లోని దగన్‌బుయ్యాలో చోటుచేసుకుంది. 28 ఏళ్ల సమీర్ దాస్ ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఆదివారం రాత్రి గుర్తుతెలియని కొందరు వ్యక్తులు అతడిపై అతి దారుణంగా దాడి చేశారు.
విచక్షణారహితంగా కొట్టి చంపేశారు. అనంతరం అతడి ఆటోను తీసుకెళ్లిపోయారు. సమీర్ మరణంపై అతడి కుటుంబసభ్యులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇక ఈ సంఘటనపై దగన్‌బుయ్యా పోలీస్ స్టేషన్ అధికారి మాట్లాడుతూ.. ‘నాటు తుపాకులతో కాల్చి, కర్రలతో కొట్టి సమీర్‌ను చంపేశారు. ఇది ప్రీ ప్లాన్డ్ మర్డర్‌గా తెలుస్తోంది. మర్డర్ తర్వాత వాళ్లు సమీర్ ఆటోను దొంగిలించుకుపోయారు. సమీర్ కుటుంబసభ్యులు పోలీస్ కేసు పెట్టారు. పోలీసులు దుండగులను గుర్తించి అరెస్ట్ చేసే పనిలో ఉన్నారు’ అని తెలిపారు.
రెండు రోజుల క్రితం..
గత గురువారం సునమ్‌గంజ్ జిల్లాలోని భంగాడోహోర్ గ్రామంలో 19 ఏళ్ల జై మహాపాత్రో అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఆర్థిక లావాదేవీల అంశాన్ని ఆధారంగా చేసుకుని జై మహాపాత్రోని హత్య చేశారు. అమీరుల్ ఇస్లాం అనే వ్యక్తితోపాటు మరికొంత మంది దాడి చేశారు. ఈ దాడిలో మహాపాత్రో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు.
ఇవి కూడా చదవండి
ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు ప్రభుత్వ డ్రీమ్ ప్రాజెక్ట్
మత ఉద్రిక్తతలు రెచ్చగొట్టేలా ఒవైసీ వ్యాఖ్యలు