Share News

ఐరన్‌డోమ్‌ బ్యాటరీని ధ్వంసం చేశాం: హెజ్బొల్లా

ABN , Publish Date - May 12 , 2026 | 04:44 AM

ప్రపంచంలోనే అత్యంత ఆధునికమైన గగన రక్షణ వ్యవస్థగా గుర్తింపు పొందిన ఇజ్రాయెల్‌ ఐరన్‌ డోమ్‌ వ్యవస్థలోని ఒక బ్యాటరీని...

ఐరన్‌డోమ్‌ బ్యాటరీని ధ్వంసం చేశాం: హెజ్బొల్లా

బీరుట్‌, మే 11: ప్రపంచంలోనే అత్యంత ఆధునికమైన గగన రక్షణ వ్యవస్థగా గుర్తింపు పొందిన ఇజ్రాయెల్‌ ఐరన్‌ డోమ్‌ వ్యవస్థలోని ఒక బ్యాటరీని డ్రోన్‌తో ధ్వంసం చేసినట్లు లెబనాన్‌లోని హెజ్బొల్లా సంస్థ ప్రకటించింది. రాడార్‌, ఇంటర్‌సెప్టర్‌ క్షిపణుల లాంచర్‌తో కూడిన ట్రక్కులాంటి వాహనాన్ని బ్యాటరీ అంటారు. దీనిని ఎక్కడి నుంచి ఎక్కడికైనా సులువుగా, వేగంగా తరలించవచ్చు. ఈ బ్యాటరీని ఫస్ట్‌ పర్సన్‌ వ్యూ (ఎఫ్‌పీవీ) డ్రోన్‌తో ఽధ్వంసం చేసినట్లు ఆ సంస్థ ఆదివారం రాత్రి ప్రకటించింది. దాడికి సంబంధించిన వీడియోను కూడా విడుదల చేసింది. దీనిపై ఇజ్రాయెల్‌ సైన్యం స్పందించలేదు.

ఇవి కూడా చదవండి..

మాజీ సీఎం స్టాలిన్‌ను కలిసిన విజయ్.. తమిళ రాజకీయాల్లో కొత్త చర్చ..

సీఎం తప్పితే ఇంకేమీ వద్దు... పట్టుబడుతున్న సతీశన్, రంగంలోకి రాహుల్

Updated Date - May 12 , 2026 | 04:44 AM