అమెరికా మిడ్ ఎన్నికల్లో భారీగా పోలింగ్
ABN , Publish Date - Nov 04 , 2026 | 01:49 AM
అమెరికా మిడ్‌టర్మ్ ఎన్నికల్లో భారీగా పోలింగ్ నమోదవుతోంది. కొన్ని రాష్ట్రాల్లో బుధవారం ఉదయం (భారత కాలమానం ప్రకారం) 5.30 గంటలకు పోలింగ్ ముగిసింది.
కొన్ని రాష్ట్రాల్లో ఇంకా కొనసాగుతున్న ఓటింగ్
వాషింగ్టన్, నవంబరు 3: అమెరికా మిడ్‌టర్మ్ ఎన్నికల్లో భారీగా పోలింగ్ నమోదవుతోంది. కొన్ని రాష్ట్రాల్లో బుధవారం ఉదయం (భారత కాలమానం ప్రకారం) 5.30 గంటలకు పోలింగ్ ముగిసింది. అక్కడ 70 నుంచి 75 శాతం వరకు పోలింగ్ నమోదైందని అధికారులు తెలిపారు. జార్జియా, మిచిగన్, నార్త్ కరోలినా, సౌత్ కరోలినా వంటి రాష్ట్రాల్లో ముందస్తు ఓటింగ్ కూడా గతంతో పోలిస్తే 13 నుంచి 75 శాతం వరకు పెరిగింది. చమురు, నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరగటంతో అధ్యక్షుడు ట్రంప్ విధానాలపై కోపంగా ఉన్న సామాన్య ప్రజలంతా ఓటు వేయటానికి ఆసక్తి చూపినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. అమెరికాలో వేర్వేరు కాలమానాలు ఉండటంతో ప్రధాన భూభాగంలోని పశ్చిమ ప్రాంత రాష్ట్రాల్లో బుధవారం ఉదయం 8.30 వరకు పోలింగ్ జరుగుతుంది. చివరగా అలస్కాలో ఉదయం 11.30 గంటలకు పోలింగ్ ముగుస్తుంది. పోలింగ్ ముగిసిన వెంటనే కొన్ని ప్రాంతాల్లో ఓట్ల లెక్కింపు కూడా మొదలుపెట్టారు. బుధవారం సాయంత్రానికి ఎవరు గెలుస్తారు? ఎవరు ఓడతారన్నది దాదాపు తేలిపోతుంది. అయితే, తుది ఫలితాలు రావటానికి కొన్నిరోజుల సమయం పడుతుంది.
ఈ వార్తలు కూాడా చదవండి..
14 మందితో వెళ్తున్న నౌకపై ఒమన్‌లో దాడి.. భారతీయ నావికుడి మృతి
నేపాల్‌లో ఘోర ప్రమాదం.. గాల్లోనే ఢీకొన్న రెండు హెలికాప్టర్లు.. ఒకరి మృతి