Venezuela: వెనెజువెలా అధ్యక్ష భవనం వద్ద భారీ కాల్పులు..
ABN , Publish Date - Jan 06 , 2026 | 10:01 AM
వెనెజువెలా రాజధాని కారకాస్‌లోని అధ్యక్ష భవనం వద్ద భారీ కాల్పులు, పేలుళ్ల కలకలం రేగింది. అధ్యక్షుడు నికోలస్ మదురోను యూఎస్ భద్రతా సిబ్బంది అరెస్ట్ చేసి తీసుకెళ్లిన తరువాత వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షురాలిగా డెల్సీ రోడ్రిగ్జ్ ప్రమాణం స్వీకారం చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: వెనెజువెలా రాజధాని కారకాస్‌లోని అధ్యక్ష భవనం వద్ద భారీ కాల్పులు, పేలుళ్లు కలకలం రేపాయి. అధ్యక్షుడు నికోలస్ మదురోను యూఎస్ భద్రతా సిబ్బంది అరెస్ట్ చేసి తీసుకెళ్లిన తరువాత వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షురాలిగా డెల్సీ రోడ్రిగ్జ్ ప్రమాణం స్వీకారం చేశారు. ఇది జరిగిన గంటల వ్యవధిలోనే అంటే సోమవారం రాత్రి సమయంలో కారకాస్‌లోని అధ్యక్ష భవనంపై గుర్తు తెలియని డ్రోన్ సంచరించింది. దీనిని గమనించిన భద్రతా దళాలు.. డ్రోన్‌పై అటాక్ చేశాయి. భారీగా కాల్పులు జరిపాయి. ప్రస్తుతం అక్కడ వాతావరణం ప్రశాంతంగా ఉన్నట్లు సమాచారం. కాగా, ఈ కాల్పులకు ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
క్లారిటీ ఇచ్చిన అమెరికా..
ఇదిలాఉంటే.. ఈ కాల్పుల ఘటనకు అమెరికాకు సంబంధం లేదని వైట్‌హౌస్ నుంచి ఒక ప్రకటన వచ్చింది. డ్రోన్ విషయంలో అమెరికా ప్రమేయం ఏమాత్రం లేదని ప్రకటనలో పేర్కొంది వైట్‌హౌస్.