హమాస్ కొత్త అధినేతగా ఖలీల్ అల్ హయ్యా ఎన్నిక.. అధికారిక ప్రకటన విడుదల!
ABN , Publish Date - Jul 20 , 2026 | 06:51 PM
హమాస్ కొత్త నాయకుడిగా ఖలీల్ అల్ హయ్యా ఎన్నికయ్యారు. ఖలీల్ అల్ హయ్యా ఎన్నికపై హమాస్ సోమవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది.
ఇంటర్‌నెట్ డెస్క్: హమాస్ కొత్త నాయకుడిగా ఖలీల్ అల్ హయ్యా ఎన్నికయ్యారు. ఖలీల్ అల్ హయ్యా ఎన్నికపై హమాస్ సోమవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. అంతర్గత ఎన్నికల్లో మాజీ హమాస్ పొలిటికల్ లీడర్ ఖలీద్ మేషాల్‌పై ఖలీల్ అల్ హయ్యా విజయం సాధించారని హమాస్ ఆ ప్రకటనలో తెలిపింది. అల్ హయ్యా గతంలో హమాస్ గ్రూప్‌నకు డిప్యూటీ ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించారు.
హమాస్ అధినేత యహ్య సిన్వర్‌తో పాటు ఇస్మాయిల్ హనియా మరణం తర్వాత ఐదుగురు సభ్యుల తాత్కాలిక లీడర్‌షిప్ కౌన్సిల్ హమాస్‌ను నడిపించింది. ఈ కౌన్సిల్‌లో కీలక సభ్యుడిగా ఉన్న అల్ హయ్యా.. ఇజ్రాయెల్‌తో జరిగిన సీజ్‌ఫైర్, బందీల విడుదల చర్చల్లో కీలకంగా వ్యవహరించారు. తాజాగా జరిగిన అంతర్గత ఎన్నికల ద్వారా ఐదుగురు సభ్యుల తాత్కాలిక కౌన్సిల్ రద్దయింది. పూర్తిస్థాయి హమాస్ అధినేతగా ఖలీల్ అల్ హయ్యా ఎన్నికయ్యారు.
ఇవి కూడా చదవండి
బాధితుడు కోర్టును ఆశ్రయించడంతో.. తమ్మినేని స్కాం వెలుగులోకి: ఎంపీ కలిశెట్టి
ఏపీలో పలు జిల్లాలకు రైయిన్ అలర్ట్