Share News

నిప్పంటించుకుని.. వీడియో గేమ్ మేకర్ ఆత్మహత్య

ABN , Publish Date - Oct 22 , 2026 | 07:09 PM

ప్రముఖ వెబ్‌బ్రౌజర్ వీడియో గేమ్ ‘స్టిక్ రన్’ సృష్టికర్త, జర్మన్ ఇన్‌ఫ్లుయెన్సర్ మాన్యుయెల్ ఆట్టో ఆత్మహత్య చేసుకున్నాడు.

నిప్పంటించుకుని.. వీడియో గేమ్ మేకర్ ఆత్మహత్య
Manuel Otto

ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ వెబ్‌బ్రౌజర్ వీడియో గేమ్ ‘స్టిక్ రన్’ సృష్టికర్త, జర్మన్ ఇన్‌ఫ్లుయెన్సర్ మాన్యుయెల్ ఆట్టో ఆత్మహత్య చేసుకున్నాడు. ట్విచ్‌లో లైవ్‌స్ట్రీమింగ్‌లో అందరూ చూస్తుండగా ఒంటికి నిప్పంటించుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. అక్టోబర్ 21న ఈ ఘటన చోటుచేసుకుంది. బవేరియాలోని ఓ ఇంట్లో అతడి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. మంటలు చెలరేగగానే గుర్తించిన ఇరుగుపొరుగు అతడిని కాపాడేందుకు ప్రయత్నించినా ఉపయోగం లేకపోయింది.


ఈ ఉదంతంపై ట్విచ్ కూడా స్పందించింది. ఆట్టో ఛానల్‌ నుంచి ఆ వీడియోను తొలగించినట్టు తెలిపింది. ‘మాన్యుయెల్ మరణం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ట్విచ్ సభ్యుల మానసిక ఆరోగ్యానికి మేము తొలి ప్రాధాన్యం ఇస్తున్నాము’ అని ట్విచ్ ప్రతినిధి తెలిపారు. మానసిక ఇబ్బందుల్లో ఉన్నవారు ఒంటరిగా కుమిలిపోవద్దని, ఎవరితోనైనా మనోభావాలను పంచుకోవాలని సూచించింది. కౌన్సిలింగ్ తీసుకోవాలని చెప్పింది.


మాన్యుయెల్ ఆట్టో జర్మనీలో 1996లో జన్మించాడు. 2010లో అతడు 14 ఏళ్ల వయసులోనే ఫేస్‌బుక్ వేదికగా ఫ్రీటూప్లే గేమ్‌ను క్రియేట్ చేశాడు. గేమ్‌లో భాగంగా కంట్రోల్ స్టిక్ క్యారెక్టర్‌తో గేమర్లు అడ్డంకుల్ని ఒక్కొక్కటిగా అధిగమిస్తూ కాయిన్స్, పాయింట్స్ గెలుచుకుంటారు. చిన్నప్పటి నుంచీ యానిమేటెడ్ వీడియోలను ఎంజాయ్ చేసిన తాను చివరకు వీడియో గేమ్ రంగంలోకి అడుగుపెట్టానని 2013లో ఓ ఇంటర్వ్యూలో అతడు చెప్పాడు. స్టిక్ రన్ గేమ్‌ను ప్రపంచవ్యాప్తంగా 43 మిలియన్ల మంది గేమర్స్ డెస్క్‌టాప్, సెల్‌ఫోన్స్‌లో ఆడుతూ ఎంజాయ్ చేస్తున్నారు.


ఈ వార్తలనూ చదవండి:

భారత్ ఆందోళనను అర్థం చేసుకున్నాము: యూఎస్ మంత్రి రూబియో

సౌదీ ఎయిర్‌‌పోర్టుపై దాడి.. మృతుల్లో భారతీయుడు

Updated Date - Oct 22 , 2026 | 08:21 PM