Share News

అమెరికాపై ఇరాన్‌ డ్రోన్‌ దాడులు జరగొచ్చు

ABN , Publish Date - Mar 12 , 2026 | 05:59 AM

అమెరికా పశ్చిమతీరంపై ఇరాన్‌ డ్రోన్‌ దాడులు జరగొచ్చని ఆ దేశ దర్యాప్తు సంస్థ ‘ఎఫ్‌బీఐ’ హెచ్చరించింది. తీరానికి సమీపంలోని నౌకల నుంచి డ్రోన్లను...

అమెరికాపై ఇరాన్‌ డ్రోన్‌ దాడులు జరగొచ్చు

  • తీరానికి సమీపంలోని నౌకల నుంచి ప్రయోగించే చాన్స్‌

  • కాలిఫోర్నియా పోలీసులకు ఎఫ్‌బీఐ హెచ్చరిక

వాషింగ్టన్‌, మార్చి 11: అమెరికా పశ్చిమతీరంపై ఇరాన్‌ డ్రోన్‌ దాడులు జరగొచ్చని ఆ దేశ దర్యాప్తు సంస్థ ‘ఎఫ్‌బీఐ’ హెచ్చరించింది. తీరానికి సమీపంలోని నౌకల నుంచి డ్రోన్లను ప్రయోగించేందుకు ఇరాన్‌ ప్రయత్నిస్తున్నట్టుగా నిఘా వర్గాలకు సమాచారం అందిందని వెల్లడించింది. ముఖ్యంగా కాలిఫోర్నియాలోని కీలక ప్రాంతాలను లక్ష్యంగా చేసుకోవచ్చని.. ఈ విషయంలో అక్కడి పోలీసులు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేసింది. మెక్సికో వైపు నుంచి, పసిఫిక్‌ ప్రాంతం నుంచి ఈ ముప్పు ఉండవచ్చని అమెరికా నిఘా విభాగం మాజీ చీఫ్‌ జాన్‌ కొహెన్‌ పేర్కొన్నారు. ఇరాన్‌కు మెక్సికోతో, దక్షిణ అమెరికాలోని దేశాలతో మంచి సంబంధాలు ఉన్నాయని, వాటి సాయంతో ఇరాన్‌ డ్రోన్‌ దాడులు చేసే ప్రమాదం ఉందని తెలిపారు.

ఇవి కూడా చదవండి..

సీఈసీ అభిశంసనకు నోటీసుపై 180 మంది ఎంపీల సంతకం

స్పీకర్‌ ఓంబిర్లాపై వీగిపోయిన అవిశ్వాస తీర్మానం

Updated Date - Mar 12 , 2026 | 05:59 AM