Share News

పోర్నోగ్రఫీపై పన్నుతో యుద్ధ నిధుల సమీకరణ.. ఉక్రెయిన్ యోచన

ABN , Publish Date - Sep 07 , 2026 | 11:52 AM

రష్యాతో యుద్ధానికి కావాల్సిన నిధులు సమకూర్చుకునేందుకు పోర్నోగ్రఫీని ఉక్రెయిన్ చట్టబద్ధం చేసే యోచనలో ఉన్నట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.

పోర్నోగ్రఫీపై పన్నుతో యుద్ధ నిధుల సమీకరణ.. ఉక్రెయిన్ యోచన
Ukraine Pornography Legalization Attempt

ఇంటర్నెట్ డెస్క్: రష్యాతో యుద్ధానికి కావాల్సిన నిధులు సమకూర్చుకునేందుకు పోర్నోగ్రఫీని ఉక్రెయిన్ చట్టబద్ధం చేసే యోచనలో ఉన్నట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. తద్వారా పోర్నోగ్రఫీపై పన్నుతో నిధులు సమీకరించవచ్చని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. ఉక్రెయిన్ ఆర్థికవ్యవహారాల పార్లమెంటరీ కమిటీ ఛైర్‌పర్సన్ యారోస్లావ్ జెలెజ్నియాక్ ఇందుకు సంబంధించిన బిల్లుకు రూపకల్పన చేశారు. పోర్నోగ్రఫీపై పన్నుతో ఏటా 25 మిలియన్ డాలర్ల వార్షిక ఆదాయం సమకూరుతుందని పార్లమెంటరీ కమిటీ అంచనా వేసింది.


వాస్తవానికి ఉక్రెయిన్ యుద్ధ బడ్జెట్‌తో పోలిస్తే పోర్నోగ్రఫీపై పన్నుతో సమకూరే నిధులు స్వల్పమేనని అక్కడి వర్గాలు చెబుతున్నాయి. యుద్ధం కోసం ఉక్రెయిన్ ఏటా 120 బిలియన్ డాలర్లు ఖర్చు చేస్తోంది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఆదాయ వనరు దేశానికి కీలకమని అక్కడి వర్గాలు భావిస్తున్నాయి. పోర్నోగ్రఫీపై పన్ను నిధులతో ఏటా 30 వేల డ్రోన్స్‌ను సమకూర్చుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నాయి.


ఇప్పటికే ఉక్రెయిన్‌లో కొందరికి పోర్నోగ్రఫీ కనకవర్షం కురిపిస్తోంది. 2023లో ఈ రంగంలోని 7,900 మంది ఏకంగా 131 మిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఆర్జించారు. దీంతో, ఈ రంగం దేశానికి ఓ ఆదాయ వనరుగా మారగలదని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. దీనికి చట్టబద్ధత కల్పిస్తే అవినీతిని అడ్డుకోవచ్చని, చట్ట ఉల్లంఘనలను తగ్గించవచ్చని కొన్ని వర్గాలు వాదిస్తున్నాయి. ఈ బిల్లు జులైలోనే పార్లమెంటు ముందుకు వచ్చింది. బిల్లుకు కొన్ని మార్పులను కూడా పార్లమెంటు సూచించింది. తుది బిల్లును త్వరలో మరోసారి పరిశీలించే అవకాశం ఉంది.


ఈ వార్తలనూ చదవండి:

అమెరికా ఉద్యోగాలు అమెరికన్లకే!

అదుపుతప్పి వాహనాలపైకి దూసుకెళ్లిన కార్గో విమానం.. ఐదుగురి మృతి..

Updated Date - Sep 07 , 2026 | 12:17 PM