Share News

ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ రేసులో ఖమేనీ కుమారుడు మొజ్తాబా

ABN , Publish Date - Mar 03 , 2026 | 01:55 PM

కొత్త సుప్రీం లీడర్‌ను ఎంపిక చేయటంలో ఇరాన్ బిజీ అయిపోయింది. ఆయతుల్లా అలీ ఖమేనీ కుమారుడు మొజ్తాబా కొత్త సుప్రీం లీడర్ రేసులో ఉన్నారు.

ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ రేసులో ఖమేనీ కుమారుడు మొజ్తాబా
Iran Supreme Leader race

టెహ్రాన్, మార్చి 3: ఓ వైపు అమెరికా, ఇజ్రాయెల్ దేశాలతో యుద్ధం చేస్తూనే.. మరో వైపు కొత్త సుప్రీం లీడర్‌ను ఎంపిక చేయటంలో ఇరాన్ బిజీ అయిపోయింది. ఆయతుల్లా అలీ ఖమేనీ కుమారుడు మొజ్తాబా కొత్త సుప్రీం లీడర్ రేసులో ఉన్నారు. రివల్యూషనరీ గార్డ్స్ మొదట మొజ్తాబా వైపు మొగ్గు చూపింది. అయితే, వారసత్వం విమర్శలు వచ్చే అవకాశముందని భావించిన ఆర్జీసీ ఈ విషయంలో కాస్త వెనక్కు తగ్గింది. సుప్రీం లీడర్ రేసులో మొజ్తాబాతో పాటు ఇబ్రహీం రైసి, సాధిక్ లర్జానీ కూడా ఉన్నారు. కొత్త సుప్రీం లీడర్‌ ఎంపికను త్వరగా పూర్తి చేయాలని ఇరాన్ భావిస్తోంది. విప్లవ నేతనే ఎంపిక చేస్తామని అసెంబ్లీ ఆఫ్ ఎక్స్‌పర్ట్స్ సభ్యుడు స్పష్టం చేశారు.


తాత్కాలిక సుప్రీం లీడర్‌గా అరాఫీ

ఇరాన్ నాయకులే లక్ష్యంగా టెహ్రాన్‌లోని 30 ప్రాంతాల్లో శనివారం భీకర బాంబు దాడులు జరిగాయి. ఈ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ ప్రాణాలు కోల్పోయారు. ఆయనతో పాటు కూతురు, అల్లుడు, మనవడు చనిపోయారు. తీవ్రంగా గాయపడ్డ ఖమేనీ భార్య ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నిన్న తుదిశ్వాస విడిచారు. ఖమేనీ స్థానంలో తాత్కాలిక సుప్రీం లీడర్‌గా ఆయతుల్లా అలీరెజా అరాఫీ నియమితులయ్యారు. ఇప్పుడు కొత్త సుప్రీం లీడర్ ఎంపిక జరుగుతోంది.


గల్ఫ్‌ దేశాలపై కొనసాగుతున్న ఇరాన్ దాడులు

గల్ఫ్ దేశాలపై ఇరాన్ ప్రతీకార దాడులు కొనసాగుతున్నాయి. సౌదీలోని అమెరికా ఎంబసీపై ఇరాన్ డ్రోన్ దాడి చేసింది. రియాద్‌లో రెండు డ్రోన్లతో దాడి చేసింది. ఇరాన్ దాడుల నేపథ్యంలో భద్రతా బలగాలు హైఅలర్ట్ ప్రకటించాయి. ఎంబసీపై దాడి తర్వాత సౌదీలో అమెరికా సేవలు నిలిచిపోయాయి. అన్ని కాన్సులేట్ సేవలు తాత్కాలికంగా రద్దయ్యాయి.


ఇవి కూడా చదవండి

భారత్‌లో చిక్కుకున్న వెస్టిండీస్, జింబాంబ్వే క్రికెట్ జట్లు

మీ ఆలోచన వేగం ఎంత.. ఈ ఫొటోల్లోని మూడు తేడాలను 29 సెకెన్లలో కనిపెట్టండి

Updated Date - Mar 03 , 2026 | 02:00 PM