అఫ్గానిస్థాన్‌లో భూకంపం.. ఉత్తర భారతంలో ప్రకంపనలు
ABN , Publish Date - Apr 03 , 2026 | 10:35 PM
ఉత్తరాది రాష్ట్రాల్లో నేడు పలు చోట్ల భూమి స్వల్పంగా కంపించింది. అఫ్గానిస్థాన్‌లో 5.9 తీవ్రతతో భూకంపం సంభవించిన నేపథ్యంలో ఉత్తర భారతంలో కూడా పలు చోట్ల భూమి కంపించింది.
ఇంటర్నె్ట్ డెస్క్: ఉత్తరాది రాష్ట్రాల్లో పలు చోట్ల భూమి స్వల్పంగా కంపించింది. శుక్రవారం అఫ్గానిస్థాన్‌లో 5.9 తీవ్రతతో భూకంపం సంభవించిచడంతో ఆ ప్రభావం ఉత్తరభారతంలోనూ కనిపించింది.
ఉత్తరాదిన శుక్రవారం రాత్రి 9.50 గంటల సమయంలో పలు ప్రాంతాల్లో ప్రకంపనలు సంభవించాయి. న్యూఢిల్లీలో పాటు, నోయిడా, చండీగఢ్, పంజాబ్‌లోని లూథియానా, జమ్మూకశ్మీరలోని పూంచ్ సెక్టర్, శ్రీనగర్, కశ్మీర్‌లోని పలు ప్రాంతాల్లో ప్రకంపనలు వచ్చాయి. డెహ్రాడూన్‌లో కూడా ప్రకంపనలు సంభవించాయి. కొన్ని సెకన్ల పాటు భూమి కంపించిందని పలు భవనాల్లోని వారు తెలిపారు.
ఇక పాకిస్థాన్‌లో కూడా పలు చోట్ల ప్రకంపనలు సంభవించాయి. ఇస్లామాబాద్, పంజాబ్‌లోని పలు ప్రాంతాలు, ఖైబర్ పాఖ్‌తూన్‌ఖ్వా ప్రావిన్స్, పెషావర్‌లోని కొన్ని ప్రాంతాల్లో భూమి కంపించిందని స్థానికులు తెలిపారు. అఫ్గానిస్థాన్‌లోని హిందూ కుష్ ప్రాంతంలో తొలుత భూకంపం సంభవించింది. భూకంప కేంద్రం ఎక్కడ ఉందనే విషయం మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. భూకంపానికి భయపడిపోయిన స్థానికులు అనేక మంది తమ ఇళ్లు, కార్యాలయాల నుంచి బయటకు పరుగులు తీశారు.
ఈ వార్తలనూ చదవండి:
భారత్‌కు ఎల్‌ఎన్‌జీ సరఫరాను పెంచగలం: రష్యా
ఇరాన్‌కు చిక్కిన యూఎస్ ఫైటర్ జెట్ పైలట్.. మీడియాలో సంచలన కథనం