రండి బాబూ రండి.. బంగారంపై డిస్కౌంట్ ఇస్తాం!
ABN , Publish Date - Mar 08 , 2026 | 04:07 AM
ఇరాన్-ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం ప్రభావం దుబాయ్‌లో బంగారం ధరలపైనా పడింది! యుద్ధం కారణంగా విమాన ప్రయాణాలకు...
దుబాయ్‌లో కిలో పుత్తడిపై 90 వేల రాయితీ
దుబాయ్: ఇరాన్-ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం ప్రభావం దుబాయ్‌లో బంగారం ధరలపైనా పడింది! యుద్ధం కారణంగా విమాన ప్రయాణాలకు తీవ్ర ఆటంకాలు ఏర్పడుతుండడంతో..బంగారాన్ని ఎగుమతి చేయడం దుబాయ్‌లోని బులియన్ వ్యాపారులకు ఇబ్బందిగా మారుతోంది. దీనికితోడు.. యుద్ధం కారణంగా రవాణా ఖర్చులు, బీమా ఖర్చులు పెరిగిపోయాయి. బోలెడంత పెట్టుబడి పెట్టి కొన్న బంగారాన్ని ఎక్కువకాలం తమ వద్ద అట్టిపెట్టుకోలేక దుబాయ్ వ్యాపారులు.. ఔన్సుకు (31.1035 గ్రాముల) 30 డాలర్ల మేర ధర తగ్గించి అమ్మేస్తున్నారు. 30డాలర్లంటే.. దాదాపు రూ.2,700. అంటే తులం బంగారంపై దాదాపు రూ.900 దాకా తగ్గిస్తున్నట్టు. కిలోల లెక్కల పుత్తడి కొనుగోళ్లు చేసే వ్యాపారులకు మాత్రం ఇది నిజంగా సువర్ణావకాశమే. కిలో బంగారం మీద దాదాపు రూ.90 వేల దాకా తగ్గుతుంది.
ఇవి కూడా చదవండి:
టీమిండియాలో ప్రతి ప్లేయర్ డేంజరే.. మేం చాలా జాగ్రత్తగా ఆడాలి: కివీస్ కెప్టెన్ శాంట్నర్
ఈసారైనా గెలవండి.. లేదంటే ఆ చోకర్స్ ట్యాగ్ మీకిచ్చేస్తా: కివీస్‌కు డేల్ స్టెయిన్ వార్నింగ్