Share News

డ్రోన్ దాడి.. మంటల్లో రష్యా సరకు రవాణా నౌక

ABN , Publish Date - Nov 21 , 2026 | 07:14 PM

రష్యాకు చెందిన ఓ సరకు రవాణా నౌకపై తాజాగా డ్రోన్ దాడి జరిగింది. రష్యా తీరానికి మూడు నాటికల్ మైళ్ల దూరంలో గల్ఫ్ ఆఫ్ ఫిన్‌లాండ్ జలాల్లో ఈ దాడి జరిగినట్టు అక్కడి అధికారులు తెలిపారు.

డ్రోన్ దాడి.. మంటల్లో రష్యా సరకు రవాణా నౌక
Drone Attack on Russian Cargo Ship

ఇంటర్నెట్ డెస్క్: రష్యాకు చెందిన ఓ సరకు రవాణా నౌకపై తాజాగా డ్రోన్ దాడి జరిగింది. రష్యా తీరానికి మూడు నాటికల్ మైళ్ల దూరంలో గల్ఫ్ ఆఫ్ ఫిన్‌లాండ్ జలాల్లో ఈ దాడి జరిగినట్టు అక్కడి అధికారులు తెలిపారు. కాలినిన్‌గ్రాడ్ వైపు వెళుతుండగా ఈ దాడి జరిగిందని అన్నారు. నౌక సిబ్బందిని సురక్షిత ప్రాంతానికి తరలిస్తున్నామని, ఈ దాడితో ఎంత నష్టం జరిగిందో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని లెనిన్ గ్రాడ్ ప్రాంతీయ గవర్నర్ డ్రోజ్‌డెన్కో తెలిపారు. దాడి తరువాత నౌకలో మంటలు ఎగసిపడుతున్నాయని ఫిన్‌లాండ్ పేర్కొంది. నౌక తమ పరిధిలోని సముద్ర జలాల్లోకి కొట్టుకువచ్చిందని వెల్లడించింది.


అయితే, ఈ ఘటనతో అక్కడ సముద్రయానికి ఎలాంటి అవాంతరాలు లేవని కూడా ఫిన్‌లాండ్ అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే, తాము ఇప్పటివరకూ 80కి పైగా డ్రోన్ దాడులకు అడ్డుకున్నామని డ్రోజ్‌డెన్కో చెప్పారు. బాల్టీక్ సముద్ర తీర ప్రాంతంలో ఉన్న రష్యా భూభాగాన్ని కాలినిన్‌గ్రాడ్ అని పిలుస్తారు. ఐరోపా దేశాలైన పొలాండ్, లిథువేనియా మధ్యలో ఈ ప్రాంతం ఉంటుంది. ఈ ప్రాంతం కారణంగా అప్పుడప్పుడూ రష్యా, ఐరోపా సమాఖ్య, నాటో కూటమిల మధ్య అభిప్రాభేదాలు తలెత్తుతుంటాయి.


ఈ వార్తలనూ చదవండి:

హెలికాప్టర్ల నుంచి తూటాల వర్షం.. కరుడుగట్టిన గ్యాంగ్‌‌స్టర్ అరెస్టు

పారిశ్రామిక విప్లవం కంటే ఏఐ విప్లవమే పెద్దది.. ఆంథ్రోపిక్ ఐపీఓపై ట్రంప్ ప్రశంసలు..

Updated Date - Nov 21 , 2026 | 07:51 PM