Share News

అందుకే నేను బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకోను: ట్రంప్

ABN , Publish Date - May 01 , 2026 | 12:23 PM

తనకు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకోవడం అంతగా ఇష్టం ఉండదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా చెప్పుకొచ్చారు. దాని వల్ల తాను మరింత లావుగా కనిపించే అవకాశం ఉందని చెప్పారు.

అందుకే నేను బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకోను: ట్రంప్
Donald Trump

ఇంటర్నెట్ డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై ఇప్పటికే మూడు సార్లు హత్యాయత్నం జరిగింది. అయినప్పటికీ తనకు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ధరించడం ఇష్టం ఉండదని ట్రంప్ తాజాగా తెలిపారు. ‘బుల్లెట్ ప్రూఫ్ జాకెట్‌ వేసుకుంటే 20 పౌండ్‌ల బరువు పెరిగినట్టు కనిపిస్తాను. నాకు అది నచ్చదు’ అని ట్రంప్ అన్నారు.

ఇటీవల ట్రంప్ పాల్గొన్న శ్వేతసౌధం కరస్పాండెంట్స్ డిన్నర్ కార్యక్రమంలో కాల్పుల కలకలం రేగిన విషయం తెలిసిందే. నిందితుడు ట్రంప్‌ను కూడా టార్గెట్ చేసి ఉండవచ్చని అక్కడి అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్ ఇకపై బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ధరించాలన్న ప్రతిపాదనను ప్రభుత్వ యంత్రాంగం తెరపైకి తెచ్చింది.ఈ అంశంపై ట్రంప్ తాజాగా స్పందించారు. ‘నన్ను బుల్లెట్ ప్రూఫ్ వేసుకోమని వాళ్లు సూచించారు. ఈ విషయాన్ని పరిశీలించాలని అన్నారు’ అని ట్రంప్ చెప్పారు.


ట్రంప్ మొదటి నుంచీ తన లుక్స్‌పై ప్రత్యేక శ్రద్ధ పెడతారని ఆయనను దగ్గర నుంచి గమనించిన వారు చెబుతారు. ట్రంప్ గతంంలో ఒక రియాల్టీ టీవీ షోలో కూడా పాల్గొన్నారు. ఇక రెండో సారి అధ్యక్షుడు అయ్యాక ట్రంప్ కాస్త బరువు తగ్గినట్టు కనిపించారు. అయినప్పటికీ తన లుక్స్ విషయంలో మాత్రం ట్రంప్ జాగ్రత్తగానే ఉంటున్నారు.


ఈ వార్తలనూ చదవండి:

ఇరాన్‌పై దాడులు.. 60 రోజుల డెడ్‌లైన్‌పై అమెరికాలో ఉత్కంఠ

ప్రెస్ డిన్నర్‌లో కాల్పులు.. ముందు రోజు రెక్కీ నిర్వహించిన నిందితుడు..

Updated Date - May 01 , 2026 | 01:16 PM