క్యూబాలో మళ్లీ పవర్‌గ్రిడ్ వైఫల్యం..చీకట్లో దేశం!
ABN , Publish Date - Mar 23 , 2026 | 06:56 AM
కూబాలో శనివారం పవర్‌గ్రిడ్ కుప్పకూలడంతో మరోసారి దేశమంతా అంధకారం అలముకొంది. ఈ నెలలోనే పవర్‌గ్రిడ్ కుప్పకూలడం...
హవానా, మార్చి 22: కూబాలో శనివారం పవర్‌గ్రిడ్ కుప్పకూలడంతో మరోసారి దేశమంతా అంధకారం అలముకొంది. ఈ నెలలోనే పవర్‌గ్రిడ్ కుప్పకూలడం ఇది మూడోసారి. న్యూవిటాస్ థర్మల్ విద్యుత్ ప్లాంట్‌లోని ఒక యూనిట్‌లో అకస్మాత్తుగా ఏర్పడిన వైఫల్యమే దీనికి కారణమని ది క్యూబన్ ఎలక్ర్టిక్ యూనియన్ ప్రకటించింది. అమెరికా ఆంక్షల నేపథ్యంలో మౌలిక సదుపాయాల కల్పనకు క్యూబా ప్రభుత్వం అష్టకష్టాలు పడుతోంది. రోజూ 12 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోతోంది. గత మూడు నెలలుగా విదే శాల నుంచి ఇంధన సరఫరా ఆగిపోయిందని క్యూబా అధ్యక్షుడు మిగుయెల్ డియాజ్ కేనల్ చెప్పారు. క్యూబాకు ఇంధనం విక్రయించే దేశాలపై టారి్‌ఫలు పెంచేస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన హెచ్చరికలే దీనికి కారణమన్నారు.
ఇవి కూడా చదవండి
ప్రధాని మోదీ అరుదైన రికార్డ్.. అభినందనలు తెలిపిన సీఎం చంద్రబాబు
ఐపీఎల్ 2026: వారి బ్యాటింగ్ అదుర్స్.. కానీ టైటిల్ మాత్రం గెలవడం కష్టం: రాబిన్ ఉతప్ప