Share News

యువతి కొంపముంచిన స్నేహితురాలి పెళ్లి.. ఈ ట్విస్ట్ ఊహించలేదు..

ABN , Publish Date - Jan 26 , 2026 | 09:40 PM

చైనాలో ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది. స్నేహితురాలి పెళ్లి ఓ యువతి కొంపముంచింది. పెళ్లిలో అందంగా కనిపించాలని చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. యువతికి ఏకంగా ప్రీడయాబెటీస్ వచ్చేసింది..

యువతి కొంపముంచిన స్నేహితురాలి పెళ్లి.. ఈ ట్విస్ట్ ఊహించలేదు..
extreme wedding diet

ఇంటర్‌నెట్ డెస్క్: స్నేహితురాలి పెళ్లి ఓ యువతి కొంపముంచింది. పెళ్లిలో అందంగా కనిపించాలని చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. యువతికి ఏకంగా ప్రీడయాబెటీస్ వచ్చేసింది. ఈ సంఘటన చైనాలో చోటుచేసుకుంది. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ తెలిపిన పూర్తి వివరాల్లోకి వెళితే.. ఈశాన్య చైనాలోని జెజియాంగ్ ప్రావిన్స్‌కు చెందిన 26 ఏళ్ల క్షియావోయూ హాంగ్‌ఝౌలో పని చేస్తోంది. క్షియావోయూ బెస్ట్ ఫ్రెండ్‌కు పెళ్లి నిశ్చయం అయింది. రెండు నెలల ముందే పెళ్లి డేట్ గురించి క్షియావోయూకు చెప్పింది. పెళ్లికి తప్పకుండా రావాలని అంది. ఆ సమయంలో క్షియావోయూ బరువు 65 కిలోలు.


ఎలాగైనా బరువు తగ్గి పెళ్లిలో అందంగా కనిపించాలని అనుకుంది. ‘డెవిల్ వెయిట్ లాస్ ప్లాన్’ను ఫాలో అవ్వటం మొదలెట్టింది. డైట్ ప్లాన్‌లో భాగంగా రోజూ 10 కిలోమీటర్లు నడిచేది. కేవలం కొన్ని కూరగాయలు.. కొంత చికెన్ మాత్రమే తినేది. మొత్తానికి 2 నెలల్లోనే ఆమె 15 కిలోలు తగ్గింది. అయితే, ఇక్కడే ఆమె ఊహించని ట్విస్ట్ చోటుచేసుకుంది. చాలా తక్కువ సమయంలో అంత బరువు తగ్గటంతో శరీరంలోని ఇన్సులిన్ సీక్రేషన్ మీద తీవ్ర ప్రభావం పడింది. మొత్తానికి ప్రీడయాబెటిస్ వచ్చి ఆస్పత్రిపాలైంది. ఆమెను పరీక్షించిన ‘ది ఎండోక్రినాలజీ యాట్ హాంగ్‌ఝౌ ఆఫ్ ట్రెడిషనల్ చైనీస్ మెడిసిన్స్’ వైద్యులు.. డైట్ ప్లాన్, ఎక్సర్‌సైజులు వెంటనే ఆపాలని సూచించారు.


అసోసియేట్ చీఫ్ ఫిజీషియన్ చెంగ్ బోనింగ్ మాట్లాడుతూ.. ‘ఆమె తన డైట్‌లో కార్బోహైడ్రేట్స్ పూర్తిగా నిషేధించింది. హై ఇంటెన్సిటీ ఉన్న ఎక్సర్‌సైజులు చేసింది. తద్వారా ఆమె బాడీలో ఇన్సులిన్ సీక్రేషన్ దెబ్బతింది. వాటర్, కండరాల లాస్ జరిగింది. మెటబాలిజం కూడా దెబ్బతింది’ అని తెలిపారు. సమతుల ఆహారం తీసుకోవాలని చెప్పారు. డాక్టర్ల సూచన మేరకు ఆమె డైట్ ప్లాన్ ఛేంజ్ చేసింది. కార్బోహైడ్రేట్లు కూడా తినటం మొదలెట్టింది. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం కుదుటపడింది. 52 కేజీల ఆరోగ్యకరమైన బరువుతో ఉంది.


ఇవి కూడా చదవండి

డబ్ల్యూపీఎల్-2026: సెంచరీతో చెలరేగిన సీవర్.. ఆర్సీబీ ముందు భారీ టార్గెట్

ఖరీఫ్ నాటికి వెలిగొండ ద్వారా సాగునీరు అందిస్తాం: పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు

Updated Date - Jan 26 , 2026 | 10:02 PM