ఖరీఫ్ నాటికి వెలిగొండ ద్వారా సాగునీరు అందిస్తాం: పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు
ABN , Publish Date - Jan 26 , 2026 | 09:18 PM
జగన్ ప్రభుత్వం ఐదేళ్ల పాలనలో వెలిగొండ ప్రాజెక్ట్‌ను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని, కూటమి ప్రభుత్వం 18 నెలల్లోనే 6,579 మీటర్ల బెంచింగ్ పనులు పూర్తి చేసిందని పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు తెలిపారు.
జగన్ ప్రభుత్వం ఐదేళ్ల పాలనలో వెలిగొండ ప్రాజెక్ట్‌ను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని, కూటమి ప్రభుత్వం 18 నెలల్లోనే 6,579 మీటర్ల బెంచింగ్ పనులు పూర్తి చేసిందని పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు తెలిపారు. సీఎం చంద్రబాబు 2014-19లోనే వెలిగొండ ప్రాజెక్ట్‌లో 80% పనులు పూర్తి చేశారని, జగన్ ప్రభుత్వం రూ.3 వేల కోట్లకు అనుమతులు ఇచ్చి కేవలం రూ.170 కోట్ల విలువైన పనులే చేసిందని అన్నారు (Veligonda Project update).
టీడీపీ హయాంలో రూ.1,500 కోట్లు ఖర్చు చేసి రెండు టన్నెల్స్ పూర్తికి చర్యలు తీసుకున్నామని, మిగిలిన పనులకు జీఓ-40 ద్వారా రూ.1,041 కోట్లకు పరిపాలన అనుమతులు ఇచ్చామని తెలిపారు. జగన్ ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా పేలుళ్లతో టన్నెల్ పనులు చేసి ప్రాజెక్టును దెబ్బతీసిందన్నారు. జగన్ పాలనలో టన్నెల్-2లో కేవలం 745 మీటర్ల పనులే జరిగాయని చెప్పారు. జగన్ క్రిమినల్ క్రెడిట్‌ను ఎవ్వరూ చోరీ చెయ్యలేరని పేర్కొన్నారు (Eluri Sambasiva Rao statement).
కూటమి ప్రభుత్వం కేవలం 18 నెలల్లోనే 6,579 మీటర్ల బెంచింగ్ పనులు పూర్తి చేసిందన్నారు (Veligonda tunnel works). ప్రస్తుతం రూ.1,039 కోట్లు కేటాయించి యుద్ధ ప్రాతిపదికన పనులు చేయిస్తున్నామని, ఖరీఫ్ నాటికి రైతులకు వెలిగొండ ద్వారా సాగునీరు అందిస్తామని ఏలూరి సాంబశివరావు హామీ ఇచ్చారు.
ఇవి కూడా చదవండి..
వామ్మో.. ఇదెక్కడి ప్రేమ.. బిడ్డకు తండ్రి ఎవరో తెలుసుకోవడానికి డీఎన్‌ఏ టెస్ట్ చేయిస్తుందట..
వావ్, పాములకు ఈ ట్యాలెంట్ కూడా ఉందా.. నీటిలోని చేపను ఎలా పట్టుకుందో చూడండి..