Share News

ఆ ఇంటి నిండా కొండచిలువలు.. అసలు విషయం తెలిసి పోలీసులు షాక్..

ABN , Publish Date - Jun 25 , 2026 | 03:52 PM

చైనాకు చెందిన ఓ వ్యక్తి ఇంట్లో ఏకంగా 309 కొండచిలువలు బయటపడ్డాయి. ఆ ఇంట్లో సోదాలు నిర్వహించడానికి వెళ్లిన పోలీసులు ఆ కొండచిలువలను చూసి షాక్ అయ్యారు.

ఆ ఇంటి నిండా కొండచిలువలు.. అసలు విషయం తెలిసి పోలీసులు షాక్..
python breeding

బీజింగ్, జూన్ 25: చైనాకు చెందిన ఓ వ్యక్తి ఇంట్లో ఏకంగా 309 కొండచిలువలు బయటపడ్డాయి. ఆ ఇంట్లో సోదాలు నిర్వహించడానికి వెళ్లిన పోలీసులు ఆ కొండచిలువలను చూసి షాక్ అయ్యారు. ఇంతకీ ఎవరా వ్యక్తి?.. ఆ కొండచిలువల సంగతి ఏంటి? తెలియాలంటే ఈ స్టోరీ మొత్తం చదవాల్సిందే. ఆ వివరాల్లోకి వెళితే.. 2024 మార్చి నెలలో తాయిఝౌ, ఝేజియాంగ్ ప్రావిన్స్‌లోని స్థానిక కొండ ప్రాంతంలో ఓ పెద్ద కొండచిలువను ఓ వృద్ధుడు చూశాడు.


ఆ రకం కొండచిలువలు ఆ ప్రాంతంలో ఉండవు. వృద్ధుడికి అనుమానం వచ్చి పోలీసులకు దానిపై ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అక్రమ బ్రీడింగ్ సెంటర్‌ నుంచి పాము తప్పించుకుని అడవిలోకి వచ్చి ఉంటుందని పోలీసులకు అనుమానం కలిగింది. మార్చి నెలలో ఆ ప్రాంతంలో పాములు యాక్టీవ్‌గా ఉండవు. అంటే కొత్తగా పాములు పుట్టే అవకాశం కూడా లేదు. ఈ కారణంతో పోలీసుల అనుమానం బలపడింది. పోలీసులు పాములను పెంచే వారిని సంప్రదించారు. పాములు పిల్లల్ని కనాలంటే వెచ్చటి వాతావరణం ఉండాలని పాములు పెంచే వారు పోలీసులకు చెప్పారు.
china-sankes.jpg


అక్రమంగా బ్రీడింగ్ సెంటర్ నడుపుతున్న వ్యక్తి పాముల బ్రీడింగ్ కోసం ఎలక్ట్రిసిటీని ఉపయోగిస్తుండవచ్చని తెలిపారు. పోలీసులు కొండ ప్రాంతంలో ఉన్న ఇళ్ల ఎలక్ట్రిసిటీ వాడకంపై దృష్టి సారించారు. ఈ నేపథ్యంలోనే గువో అనే వ్యక్తిపై పోలీసులకు అనుమానం వచ్చింది. అతడి ఇంటికి మిగిలిన ఇళ్లకంటే ఎక్కువ కరెంట్ బిల్ వస్తోంది. పోలీసులు అనుమానంతో అతడి గురించి ఎంక్వైరీ చేశారు. అతడికి పెళ్లి కాలేదు. ఒంటరిగా ఆ అద్దె ఇంట్లో ఉంటున్నాడు. డి అనే వ్యక్తి తరచుగా అతడి ఇంటికి వెళ్లి వస్తుండే వాడు. తెల్ల ఎలుకలు ఉండే పార్సిల్స్‌ను గువో ఇంటికి తీసుకెళుతుండే వాడు.


ఆ ఎలుకలను పెంపుడు పాములకు ఆహారంగా వేయడానికి ఉపయోగిస్తారని పోలీసులు తెలుసుకున్నారు. అన్ని రకాలుగా ఎంక్వైరీ చేసుకున్న తర్వాత పోలీసులు గువో ఇంటికి వెళ్లారు. తలుపులు ఓపెన్ చేసి లోపలికి వెళ్లగానే అక్కడి దృశ్యాలను చూసి కంపించిపోయారు. లోపల వందల కొద్దీ కొండచిలువలు ఉన్నాయి. పోలీసులు మొత్తం 309 పాములను సీజ్ చేశారు. వాటిని స్థానిక జూకు తరలించారు. అక్రమంగా పాములను పెంచి అమ్ముతున్న గువోను అరెస్ట్ చేశారు. 2014 నుంచి తాను పాములను పెంచి అమ్ముతున్నట్లు గువో పోలీసుల విచారణలో చెప్పాడు.
china-snakes.jpg


ఇవి కూడా చదవండి

వర్షాకాలంలో స్వర్గంలా మారే జాతీయ పార్కులు.. జీవితంలో ఒక్కసారైనా సందర్శించాల్సిందే!

సికింద్రాబాద్‌లో అగ్నిప్రమాదం..

Updated Date - Jun 25 , 2026 | 04:00 PM