Share News

మరీ ఇంత మోసమా.. ఫ్లాట్ కొన్న వ్యక్తికి దిమ్మతిరిగే షాక్..

ABN , Publish Date - Jun 09 , 2026 | 09:05 AM

బిల్డింగ్‌లోని 34వ అంతస్తులో ఫ్లాట్ కొన్న వ్యక్తికి ఊహించని షాక్ తగిలింది. ఆ బిల్డింగ్‌లో కేవలం 32 ఫ్లోర్‌లు మాత్రమే ఉన్నాయని తెలిసి అతడి గుండె ముక్కలైంది. డెవలపర్ చేతిలో లక్షల రూపాయలు పోగొట్టుకున్న అతడు లబోదిబోమంటున్నాడు.

మరీ ఇంత మోసమా.. ఫ్లాట్ కొన్న వ్యక్తికి దిమ్మతిరిగే షాక్..
Chinese real estate scam

బీజింగ్, జూన్ 9: బిల్డింగ్‌లోని 34వ అంతస్తులో ఫ్లాట్ కొన్న వ్యక్తికి ఊహించని షాక్ తగిలింది. ఆ బిల్డింగ్‌లో కేవలం 32 ఫ్లోర్‌లు మాత్రమే ఉన్నాయని తెలిసి అతడి గుండె ముక్కలైంది. డెవలపర్ చేతిలో లక్షల రూపాయలు పోగొట్టుకున్న అతడు లబోదిబోమంటున్నాడు. ఈ సంఘటన చైనాలో చోటుచేసుకుంది. ఘటనకు సంబంధించి సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ తెలిపిన పూర్తి వివరాల్లోకి వెళితే.. షాంగ్సీ ప్రావిన్స్‌కు చెందిన షెన్ అనే వ్యక్తి 2013లో గ్సీ అనే గ్రామానికి సమీపంలోని అపార్ట్‌మెంట్ బిల్డింగ్‌లో ఓ ఫ్లాట్ కొన్నాడు.


34వ అంతస్తులోని ఆ ఫ్లాట్ కోసం అడ్వాన్స్ కింద 16 లక్షల రూపాయలు చెల్లించాడు. 2015లో ఫ్లాట్ అతడి చేతికి రావాల్సి ఉంది. అయితే, బిల్డింగ్ నిర్మాణ పనులు పూర్తవ్వటానికి మరో రెండు సంవత్సరాల సమయం పట్టింది. 2017లో డెవలపర్ షెన్‌కు ఫోన్ చేశాడు. బిల్డింగ్‌లో 34 ఫ్లోర్లు కట్టలేదని, 32 ఫ్లోర్లు మాత్రమే కట్టామని చెప్పాడు. 32వ అంతస్తులో ఫ్లాట్ ఆఫర్ చేశాడు. ఇందుకోసం మిగిలిన డబ్బు వెంటనే కట్టమన్నాడు. షెన్ దగ్గర డబ్బులేకపోవటంతో ఆలస్యం చేశాడు. దీంతో డెవలపర్ 32వ అంతస్తులోని ఫ్లాట్లను వేరే వాళ్లకు అమ్మేశాడు.


తనకు ఫ్లాట్ రాకపోవటంతో షెన్ డబ్బులు తిరిగివ్వమని అడిగాడు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నానని, మొత్తం డబ్బులు ఒకేసారి ఇవ్వలేనని షెన్‌కు చెప్పాడు డెవలపర్. 2020లో 20 వేల యాన్లు, 2022లో 50 వేల యాన్లు చెల్లించాడు. తర్వాత షెన్‌ ఫోన్లకు స్పందించటం మానేశాడు. దీంతో షెన్ ప్రభుత్వ అధికారులను ఆశ్రయించాడు. మిగిలిన మొత్తం చెల్లించటంతో పాటు.. 27 వేల వడ్డీ కూడా చెల్లించాలని అధికారులు డెవలపర్‌ను ఆదేశించారు. డెవలపర్ అధికారులను ఆదేశాలను పట్టించుకోలేదు. ఒక్కరూపాయి కూడా చెల్లించలేదు. కోర్టుకు వెళ్లిన షెన్‌కు న్యాయం జరగలేదు. డెవలపర్ పేరు మీద ఆస్తులు లేకపోవటంతో షెన్ భారీ మొత్తంలో నష్టపోయాడు. అటు ఇల్లు పోయి.. ఇటు డబ్బులు పోయి షెన్ నరకం చూస్తున్నాడు.


ఇవి కూడా చదవండి

జాగ్రత్త.. న్యూస్‌పేపర్‌లో ప్యాక్ చేసిన ఫుడ్ తింటే ప్రాణాలకు ప్రమాదం!

హనీమూన్‌కు భర్తతో పాటు అత్తమామలు! యువతికి తిక్కరేగడంతో..

Updated Date - Jun 09 , 2026 | 09:44 AM