అణు విద్యుదుత్పత్తి కోసం చైనాలో ఒకేసారి 50అణు రియాక్టర్ల నిర్మాణం!
ABN , Publish Date - Apr 25 , 2026 | 05:47 AM
అణు విద్యుత్తుపై చైనా ప్రత్యేకంగా దృషి ్టసారించింది. శిలాజ ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గించుకోవడం కోసం ఒకేసారి దాదాపు...
బీజింగ్, ఏప్రిల్ 24: అణు విద్యుత్తుపై చైనా ప్రత్యేకంగా దృషి ్టసారించింది. శిలాజ ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గించుకోవడం కోసం ఒకేసారి దాదాపు 50 న్యూక్లియర్ రియాక్టర్లను నిర్మించనున్నట్లు ఆ దేశ అణు ఇంధన సంస్థ ప్రకటించింది. చైనాలో ప్రస్తుతం విద్యుదుత్పత్తి కోసం 60 అణురియాక్టర్లు ఉన్నాయి. ఇంకా 36 రియాక్టర్లు నిర్మాణ దశలో ఉన్నాయి. వీటితో పాటు మరో 16 రియాక్టర్ల నిర్మాణానికి ఆమోదం తెలిపినట్లు చైనా అణు ఇంధన సంస్థ తెలిపింది. ప్రస్తుతం చైనా అణు విద్యుదుత్పత్తి సామర్థ్యం 66గిగావాట్లు కాగా.. దాన్ని 2040కల్లా 200గిగావాట్లకు పెంచాలని చైనా లక్ష్యంగా పెట్టుకుంది. కాగా, భారత అణు విద్యుదుత్పత్తి సామర్థ్యం 8.78గిగావాట్లు.
ఈ వార్తలు కూడా చదవండి...
ఆ వీడియోలతో బ్లాక్ మెయిల్.. హనీట్రాప్ ముఠా సంచలనం
శబరిమల కేసు విచారణలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
బాలికల కాలేజీలో కోఎడ్యుకేషన్ ఏర్పాటుపై హైకోర్టు అసంతృప్తి
Read Latest AP News And Telangana News And International News