చైనాలో రోబోల ఎంఎంఏ ఫైట్
ABN , Publish Date - Jul 20 , 2026 | 05:57 AM
రజనీకాంత్ రోబో సినిమాలో చిట్టి చేసిన ఫైట్లు గుర్తున్నాయా ? అది సినిమానే కానీ.. చైనాకు చెందిన ‘ఇంజన్ ఏఐ’ అనే రోబోటిక్ సంస్థ తయారు చేసిన టీ800 హ్యుమనాయిడ్ రోబోలు...
గెలిస్తే దాదాపు రూ.14కోట్ల ప్రైజ్ మనీ
షెన్‌జెన్(చైనా), జూలై 19: రజనీకాంత్ రోబో సినిమాలో చిట్టి చేసిన ఫైట్లు గుర్తున్నాయా ? అది సినిమానే కానీ.. చైనాకు చెందిన ‘ఇంజన్ ఏఐ’ అనే రోబోటిక్ సంస్థ తయారు చేసిన టీ800 హ్యుమనాయిడ్ రోబోలు చిట్టిని మించి ఫైటింగులు చేసేస్తున్నాయి. ఏకంగా మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్(ఎంఎంఏ) పోటీల్లో రింగులోకి దిగి ప్రత్యర్థి రోబోలపై పంచ్‌లు, కిక్కులతో విరుచుకుపడుతున్నాయి. అవును.. అల్టిమేట్ రోబో నాకౌట్ లెజెండ్(యూఆర్‌కేఎల్) పేరిట ఇంజన్‌ఏఐ సంస్థ నిర్వహిస్తోన్న ఎంఎంఏ ఫైట్ పో టీలు ఇందుకు వేదికయ్యాయి. చైనాలోని షెన్‌జెన్‌లో గురువారం మొదలైన ఈ పోటీల్లో రోబోలు అదరగొడుతున్నాయి. ఓ పోటీలో వైట్ ఈగల్ అనే రోబో గాల్లోకి ఎగిరి మెటాడర్ అనే తన ప్రత్యర్థికి ఇచ్చిన కిక్‌కు.. మెటాడర్ తల ఊడిపోయింది. తల ఊడిన తర్వాత కూడా పోరాడిన మెటాడర్ కాసేపటికి కుప్పకూలింది. ఈ లీగ్ రెండో దశ పోటీలు సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో ఆ తర్వాత ఫైనల్ పోటీ ఉంటుంది. ఈ పోటీలో గెలిచిన రోబోకు ఇంజన్‌ఏఐ 10 మిలియన్ యువాన్‌లు దాదాపు రూ.14 కోట్ల ప్రైజ్‌మనీ కూడా ప్రకటించింది.
ఇవీ చదవండి:
'మేడ్ ఇన్ ఇండియా' సీ-295.. ఆత్మనిర్భర్ భారత్‌కు ఊతం
యూసీసీ బిల్లుకు మధ్యప్రదేశ్ కేబినెట్ ఆమోదం.. త్వరలో అసెంబ్లీకి!