ఏఐ చిప్స్‌ను సాధించేందుకు రెండేళ్లుగా చైనా విశ్వప్రయత్నం
ABN , Publish Date - Nov 22 , 2026 | 09:56 PM
ఏఐ అభివృద్ధికి కీలకమైన కంప్యూటర్ చిప్స్‌ను ఎలాగైనా తమ దేశానికి తెచ్చుకునేందుకు చైనా ప్రభుత్వం రెండేళ్లుగా సుదీర్ఘ కసరత్తు చేస్తున్నట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
ఇంటర్నెట్ డెస్క్: ఎన్విడియా మాజీ సీఈఓ జెన్సన్ హువాంగ్‌కు దగ్గరైన ఆలిస్ అనే మహిళ చైనా గూఢచారిణి అన్న ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ మీడియాలో మరో సంచలన కథనం వెలుగులోకి వచ్చింది. ఏఐ అభివృద్ధికి కీలకమైన అత్యాధునిక కంప్యూటర్ చిప్స్‌ను ఎలాగైనా తమ దేశానికి తెచ్చుకునేందుకు చైనా ప్రభుత్వం రెండేళ్లుగా సుదీర్ఘ కసరత్తు చేస్తున్నట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
అమెరికా ఆంక్షలను దాటుకుని ఏఐ కంప్యూటర్ చిప్స్ సాధించే బాధ్యత చైనా అంతర్గత భద్రత మంత్రిత్వ శాఖ తన భుజాన వేసుకున్నట్టు తెలిసింది. ఇందుకోసం రెండేళ్లుగా సుదీర్ఘకసరత్తు చేసింది. ఆ శాఖ చీఫ్ చెన్ యిక్సిన్ ఆధ్వర్యంలో ఓ ప్రత్యేక బృందం ఈ దిశగా పలు వ్యూహాలు పన్నింది.
ఏఐ అభివృద్ధికి కీలకమైన అత్యాధునిక కంప్యూటర్ చిప్స్‌ను చైనా కంపెనీలు చేజిక్కించుకునేందుకు వివిధ మార్గాల్లో అంతర్గత భద్రత మంత్రిత్వ శాఖ సాయపడింది. అంతేకాకుండా, ఈ చిప్స్ ఏయే మార్గాల్లో ఎవరెవరికి సరఫరా అవుతున్నాయో కూడా కనిపెట్టింది. అమెరికా ఆంక్షలు తీవ్రమవుతున్న నేపథ్యంలో స్వాలంబన సాధించేందుకు చైనా పడుతున్న తాపత్రయం ఈ ప్రయత్నాల్లో కనిపిస్తోందని అంతర్జాతీయ విశ్లేషకులు కామెంట్ చేస్తున్నారు. జెన్సన్ హువాంగ్‌ను ఓ కంట కనిపెట్టి ఉండేందుకు ఆలిస్.. చైనా ఇంటెలిజెన్స్ అధికారులతో కలిసి పనిచేసిందని అమెరికా నిఘా వర్గాలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే.
ఈ వార్తలనూ చదవండి:
ఎన్విడియా చిప్స్ స్మగ్లింగ్ వెనుక చైనా వ్యాపారవేత్త స్కెచ్
భారత్‌లోని వైవిధ్యం ఇతర దేశాలకు కూడా ఆదర్శం: పుతిన్