బంగ్లాదేశ్‌లో మరో దారుణం.. హిందూ మహిళపై సామూహిక అత్యాచారం..
ABN , Publish Date - Feb 23 , 2026 | 09:17 PM
బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు కొనసాగుతున్నాయి. ఇటీవల ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా అక్కడి మైనార్టీలకు రక్షణ దొరకడం లేదు. హిందువులపై దాడులు, అఘాయిత్యాలు, అకృత్యాలు కొనసాగుతూనే ఉన్నాయి.
బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇటీవల ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా అక్కడి మైనార్టీలకు రక్షణ దొరకడం లేదు. హిందువులపై దాడులు, అఘాయిత్యాలు, అకృత్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా, మరో ఘోరం వెలుగు చూసింది. ముగ్గురు దుండగులు ఓ హిందూ మహిళను అపహరించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బరిషాల్ జిల్లాలోని చందాపుర్ తాలూకాలో ఆదివారం రాత్రి ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది (Bangladesh breaking news).
దివ్యాంగురాలైన బాధితురాలు ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో భజనకు వెళ్లి తిరిగొస్తుండగా.. ముగ్గురు నిందితులు ఆమెను ఎత్తుకెళ్లారు. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. సోమవారం ఉదయం రోడ్డు పక్కన స్పృహ కోల్పోయి పడి ఉన్న ఆమెను స్థానికులు గుర్తించి హాస్పిటల్‌కు తరలించారు. తనను రకీబ్, సోహైల్, రస్సెల్ అనే ముగ్గురు అపహరించి, సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు బాధితురాలు వెల్లడించింది. తనను చిత్రహింసలకు గురిచేసి గాయపరిచినట్లు తెలిపింది. ప్రస్తుతం బాధితురాలు భోలా సదర్ ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. ఆమెకు తీవ్ర గాయాలైనట్టు వైద్యులు తెలిపారు.
బాధితురాలు ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటి వరకు ఈ ఘటనపై పోలీసులు ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. దీంతో స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితులను అరెస్టు చేయాలని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ హిందూ సంఘాలు, మానవ హక్కుల కార్యకర్తలు ఆందోళనకు దిగారు. కాగా, షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయిన తర్వాత నుంచి బంగ్లాదేశ్‌లో మైనార్టీలే లక్ష్యంగా దాడులు కొనసాగుతున్నాయి. హిందువుల ఆస్తులను ధ్వంసం చేస్తూ వారిపై హత్యలు, అత్యాచారాలకు పాల్పడుతున్నారు.
ఇవి కూడా చదవండి..
పాపం.. స్నేహితుడికి సాయం చేయాలనుకున్నాడు.. రూ.7 కోట్ల స్కామ్‌లో ఇరుక్కున్నాడు..
మీది హెచ్‌డీ చూపు అయితే.. ఈ ఫొటోలోని రెండో పిల్లి ఎక్కడుందో 7 సెకెన్లలో గుర్తించండి..