Share News

ఆపరేషన్ సిందూర్‌లో ధ్వంసమైన ఉగ్రవాద కేంద్రం.. మళ్లీ పునరుద్ధరణ

ABN , Publish Date - Aug 23 , 2026 | 04:20 PM

భారత్ దాడుల్లో ధ్వంసమైన బహావల్‌పూర్ కేంద్రాన్ని ఉగ్ర సంస్థ జైష్ ఏ మహ్మద్ పూర్తిస్థాయిలో పునురుద్ధరించింది.

ఆపరేషన్ సిందూర్‌లో ధ్వంసమైన ఉగ్రవాద కేంద్రం.. మళ్లీ పునరుద్ధరణ
Bahawalpur JeM centre Restored

ఇంటర్నెట్ డెస్క్: భారత్ దాడుల్లో ధ్వంసమైన బహావల్‌పూర్ కేంద్రాన్ని ఉగ్ర సంస్థ జైష్ ఏ మహ్మద్ పూర్తిస్థాయిలో పునురుద్ధరించింది. గతేడాది మే నెలలో ఈ కేంద్రాన్ని భారత్ ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా ధ్వంసం చేసింది. పంజాబ్ ప్రావిన్స్‌లో ఈ కేంద్రం ఉంది.

కొత్త మార్బుల్స్, పెయింట్, ప్లాస్టర్ వంటి వాటితో కేంద్రాన్ని పూర్తి్స్థాయిలో జైష్ ఏ మహ్మద్ పునరుద్ధరించింది. భారత్ దాడుల్లో ఈ కేంద్రం పైకప్పులో పెద్ద రంధ్రం పడిన విషయం తెలిసిందే. ఈ కేంద్ర ప్రాంగణంలోని ఇతర కట్టడాలు కూడా దెబ్బతిన్నాయి. నాటి దాడి తాలూకు అనవాళ్లు ఏవీ కనిపించకుండా కేంద్రాన్ని పునరుద్ధరించారు. ఇందుకోసం పాక్ ప్రభుత్వ వర్గాలే సుమారు రూ.25 కోట్ల (పాక్ కరెన్సీ)ను సమకూర్చాయని నిఘా వర్గాలు చెప్పాయి. ఇందులో సెంట్రల్ హాల్ పునరుద్ధరణకే రూ.11 కోట్లు ఖర్చైనట్టు తెలుస్తోంది. గతేడాది జమ్మూకశ్మీర్‌లోని పహల్గాం దాడిలో 26 మందిని ఉగ్రవాదులు బలితీసుకున్నారు. ఇందుకు ప్రతీకారంగా పాక్‌లోని ఉగ్రవాదుల ఆటకట్టించేందుకు భారత్ ఆపరేషన్ సిందూర్‌ ప్రయెగించింది.


అంతర్జాతీయ సరిహద్దుకు 100 కిలోమీటర్ల దూరంలో ఈ కేంద్రం ఉంది. ఉగ్రవాదంలోకి కొత్త వారిని చేర్చుకోవడం, వారికి శిక్ష వంటి కార్యక్రమాలు ఇక్కడ జరుగుతుంటాయి. ఈ కేంద్రంలో అనేక భారత వ్యతిరేక కార్యక్రమాలకు ప్రణాళికలు రూపుదిద్దుకుంటూ ఉంటాయి. 2001 నాటి పార్లమెంటు దాడి, 2016లో పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌పై దాడి, 2019 పుల్వామా ఆత్మాహుతి దాడికి మూలాలు బహావల్‌పూర్ కేంద్రంలో ఉన్నాయి. ఆపరేషన్ సిందూర్‌లో బాగంగా ఈ క్యాంపుపై జరిగిన దాడిలో జైషే వ్యవస్థాపకుడు మసూద్ అజర్‌ బంధుగణంలో సుమారు 10 మంది వరకూ మరణించారు. జైష్‌పై పాక్ 2002లోనే నిషేధం విధించినా ఉగ్రవాదులకు అన్ని రకాల సహాయ సహకారాలు అందుతూనే ఉన్నాయి.


ఈ వార్తలనూ చదవండి:

అమెరికాలో భారతీయ వ్యాపారి హత్య.. నిందితుడి చిత్రాలు విడుదల..

అమెరికా ఒత్తిడికి తలవంచబోం.. ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ కీలక వ్యాఖ్యలు..

Updated Date - Aug 23 , 2026 | 04:33 PM