Awami League Leader: బంగ్లాదేశ్‌లో దారుణం.. పోలీస్ కస్టడీలో ప్రముఖ సింగర్ మృతి..
ABN , Publish Date - Jan 13 , 2026 | 12:08 PM
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా పార్టీకి చెందిన కీలక నేతల్లో ప్రొలొయ్ ఒకరు. హిందూ రాజకీయ నాయకుడిగా ఆయనకు మంచి పేరుంది. అవామీ లీగ్ పబ్న జిల్లా యూనిట్‌కు కల్చరల్ ఎఫైర్స్ సెక్రటరీగా పని చేశారు..
బంగ్లాదేశ్‌లో దారుణం చోటు చేసుకుంది. ప్రముఖ సింగర్, మ్యూజిక్ డైరెక్టర్ ప్రొలొయ్ చకి.. పోలీస్ కస్టడీలో అనుమానాస్పద స్థితిలో కన్నుమూశారు. పోలీసుల నిర్లక్ష్యం కారణంగానే ఆయన చనిపోయినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా పార్టీకి చెందిన కీలక నేతల్లో ప్రొలొయ్ ఒకరు. హిందూ రాజకీయ నాయకుడిగా ఆయనకు మంచి పేరుంది. అవామీ లీగ్ పబ్న జిల్లా యూనిట్‌కు కల్చరల్ ఎఫైర్స్ సెక్రటరీగా పని చేశారు. 2024లో చోటు చేసుకున్న బాంబు బ్లాస్ట్ కేసుతో సంబంధం ఉందని ఆరోపిస్తూ పోలీసులు ప్రొలొయ్‌ని అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి ఆయన పోలీస్ కస్టడీలో ఉన్నారు.
ప్రొలొయ్ కుటుంబ సభ్యులు చెబుతున్న దాని ప్రకారం.. హై బీపీ, డయాబెటిస్, గుండె జబ్బులతో బాధపడుతున్న ఆయన జైలుకు వెళ్లిన తర్వాత నరకం చూశారు. జైలు అధికారులు ప్రొలొయ్ ఆరోగ్యం గురించి పట్టించుకోలేదు. సరైన వైద్యం కూడా చేయించలేదు. దీంతో సమస్యలు తీవ్రమయ్యాయి. గురువారం ఆయన ఆరోగ్యం బాగా దెబ్బతింది. జైలు అధికారులు పబ్న సదర్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రొలొయ్ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడకపోవటంతో అక్కడి వైద్యులు శుక్రవారం రాత్రి రాజ్‌షాహీ మెడికల్ కాలేజీకి రెఫర్ చేశారు. రాజ్‌షాహీ మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో ప్రొలొయ్ చనిపోయారు.
ప్రొలొయ్ మరణంపై ఆయన కొడుకు మీడియాతో మాట్లాడుతూ.. ‘ఆగస్టు 4వ తేదీన చోటు చేసుకున్న హింసకు సంబంధించి మా నాన్నపై ఎలాంటి కేసు నమోదు కాలేదు. తర్వాత బాంబ్ బ్లాస్ట్ కేసుతో సంబంధం ఉందంటూ అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోయారు. మా నాన్నకు చాలా కాలం నుంచి డయాబెటిస్, గుండె జబ్బు ఉంది. జైల్లో ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించింది. ఆ విషయం గురించి పోలీసులు అధికారికంగా మాకు సమాచారం ఇవ్వలేదు. ఆస్పత్రికి తీసుకెళ్లిన తర్వాత వేరే వాళ్లు చెబితే మాకు తెలిసింది. వెంటనే అక్కడికి వెళ్లాము. అక్కడ కూడా ఆయనకు సరైన వైద్యం అందలేదు. దీంతో ప్రాణాలు కోల్పోయారు’ అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.
ఇవి కూడా చదవండి..
భక్తులతో ఆర్టీసీ బస్టాండ్ కిటకిట
అమెరికాను ఎలా ఎదుర్కోవాలో మాకు తెలుసు.. ఇరాన్ అగ్రనేత వార్నింగ్..