Share News

Iran protests deaths: ఇరాన్‌లో మారణ హోమం.. 5 వేల మంది మృతి..

ABN , Publish Date - Jan 18 , 2026 | 09:15 PM

ఇరాన్‌లో నిరసనకారులకు, భద్రతా దళాలకు మధ్య జరుగుతున్న పోరు మారణ హోమానికి కారణమైంది. గత కొన్ని వారాలుగా ఇరాన్‌లో జరుగుతున్న ఆందోళనల్లో ఇప్పటివరకు 5 వేల మంది మరణించినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ ఐదు వేల మందిలో 500 మంది భద్రతా సిబ్బంది ఉన్నారని రాయిటర్స్ వెల్లడించింది.

Iran protests deaths: ఇరాన్‌లో మారణ హోమం.. 5 వేల మంది మృతి..
Iran protests deaths

ఇరాన్‌లో ఆర్థిక సంక్షోభం, అవినీతికి వ్యతిరేకంగా శాంతియుతంగా ప్రారంభమైన నిరసనలు హింసాత్మకంగా మారాయి. నిరసనకారులకు, భద్రతా దళాలకు మధ్య జరుగుతున్న పోరు మారణ హోమానికి కారణమైంది. గత కొన్ని వారాలుగా ఇరాన్‌లో జరుగుతున్న ఆందోళనల్లో ఇప్పటివరకు 5 వేల మంది మరణించినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ ఐదు వేల మందిలో 500 మంది భద్రతా సిబ్బంది ఉన్నారని రాయిటర్స్ వెల్లడించింది (Iran deaths protests).


ఇన్ని వేల మంది ఇరాన్ పౌరుల మృతికి విదేశీ శక్తులే కారణమని ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా ఖమేనీ ఆరోపించారు. ఇజ్రాయెల్‌తో పాటు విదేశీ శక్తుల ప్రోత్సాహంతోనే అల్లర్లు కొనసాగుతున్నాయని, ఇంత మంది మరణాలకు బయటి వారే కారణమని ఇరాన్ ప్రభుత్వ అధికారులు పేర్కొన్నట్టు రాయిటర్స్ వెల్లడించింది. కుర్దీష్ ప్రాంతంలో అల్లర్ల తీవ్రత ఎక్కువగా ఉందని, ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 5000 మంది మరణించినట్టు ఇరాన్ ప్రభుత్వ అధికారులు ధ్రువీకరించారు. ఈ మరణాల సంఖ్య గణనీయంగా పెరగకపోవచ్చని ఇరాన్ అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.


కాగా, ఇరాన్‌పై సైనిక చర్య కోసం రెడీ అవుతున్నామని ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆ తర్వాత వెనకడుగు వేశారు. దాదాపు 800 మంది నిరసనకారులకు విధించిన మరణ శిక్షల అమలును ఇరాన్ ప్రభుత్వం ఆపేసింది. దీంతో అమెరికా సైనిక చర్య ఆగిపోయింది. అయితే తమ దేశంలో అల్లర్ల విషయంలో డొనాల్డ్ ట్రంప్‌ను నేరస్థుడిగా పరిగణిస్తున్నామని ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా ఖమేనీ వ్యాఖ్యానించారు.


ఇవి కూడా చదవండి..

వార్నీ.. రీల్స్ కోసం ఇంతకు తెగిస్తారా.. మెట్రో రైల్లో ఎగిరి తంతే..


మీవి డేగ కళ్లు అయితే.. ఈ ఫొటోలో ఉన్న ముగ్గురిని 30 సెకెన్లలో కనిపెట్టండి..

Updated Date - Jan 18 , 2026 | 09:15 PM