Share News

పాకిస్థాన్ ఎయిర్‌బేస్‌పై దాడి.. డ్రోన్‌లతో విరుచుకుపడిన అఫ్గానిస్థాన్..

ABN , Publish Date - Mar 02 , 2026 | 11:58 AM

కొద్ది రోజులుగా అఫ్గానిస్థాన్-పాకిస్థాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. ఇరు దేశాల మధ్య సరిహద్దు ప్రాంతాల్లో భీకర దాడులు కొనసాగుతున్నాయి. పాక్‌లోని కీలక సైనిక స్థావరాలపై అఫ్గానిస్థాన్ సైన్యం డ్రోన్‌లతో దాడి చేసింది.

పాకిస్థాన్ ఎయిర్‌బేస్‌పై దాడి.. డ్రోన్‌లతో విరుచుకుపడిన అఫ్గానిస్థాన్..
Pakistan air bases attack

కొద్ది రోజులుగా అఫ్గానిస్థాన్-పాకిస్థాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. ఇరు దేశాల మధ్య సరిహద్దు ప్రాంతాల్లో భీకర దాడులు కొనసాగుతున్నాయి. పాక్‌లోని కీలక సైనిక స్థావరాలపై అఫ్గానిస్థాన్ సైన్యం డ్రోన్‌లతో దాడి చేసింది. సోమవారం తెల్లవారుజామున తమ వైమానిక దళం పాక్‌లోని పలు ఎయిర్‌బేస్‌లపై దాడులకు పాల్పడినట్టు అఫ్గాన్ రక్షణ శాఖ వెల్లడించింది (Afghan drone strike on Pak).


రావల్పిండిలోని పాక్ ఆర్మీ ప్రధాన కార్యాలయానికి సమీపంలో ఉన్న నూర్‌ఖాన్ ఎయిర్‌బేస్‌పై భారీ దాడులు చేపట్టినట్టు అఫ్గాన్ రక్షణ మంత్రి శాఖ ప్రకటించింది. అలాగే క్వెట్టాలోని 12వ కార్ప్స్ ప్రధాన కార్యాలయం, ఖైబర్ పఖ్తుంఖ్వాలోని పలు కీలక పాక్ ఎయిర్‌బేస్‌లను కూడా లక్ష్యంగా చేసుకుని దాడులు చేసినట్టు తెలిపింది. తమ దేశంలోని పలు వైమానిక స్థావరాలపై పాక్ వైమానిక దాడులకు పాల్పడిందని, అందుకు ప్రతీకారంగానే ఈ దాడులు చేశామని ప్రకటించింది. తమ దాడుల్లో నూర్‌ఖాన్ ఎయిర్‌బేస్‌ సహా పలు వైమానిక స్థావరాలు దెబ్బతిన్నట్టు తెలిపింది (Pakistan air bases attack).


అలాగే తూర్పు అఫ్గాన్ నగరమైన జలాలాబాద్‌లో పాకిస్థాన్ యుద్ధ విమానాన్ని కూల్చివేసినట్టు తాలిబన్ అధికారులు ప్రకటించారు (Afghanistan Pakistan conflict). విమాన పైలెట్‌ను అదుపులోకి తీసుకున్నామన్నారు. కాగా, రావల్పిండిలోని నూర్‌ఖాన్ ఎయిర్‌బేస్‌ను ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్ తీవ్రంగా ధ్వంసం చేసింది. ప్రస్తుతం ఆ ఎయిర్ బేస్‌ను పాక్ రిపేర్ చేసుకుంటోంది. తాజాగా దానిపైనే అఫ్గాన్ కూడా దాడులకు పాల్పడింది.


ఇవి కూడా చదవండి..

కోల్‌కతాలో సంజూ వీర విహారం.. దాసోహమైన రికార్డులివే..


స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..

Updated Date - Mar 02 , 2026 | 12:01 PM