Share News

లండన్‌లో ఘాతుకం.. భారతీయుడి దారుణ హత్య..

ABN , Publish Date - Jun 14 , 2026 | 09:38 AM

లండన్‌లో దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఓ భారతీయ యువకుడు కత్తి దాడిలో ప్రాణాలు కోల్పోయాడు. మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు.

లండన్‌లో ఘాతుకం.. భారతీయుడి దారుణ హత్య..
London Knife Attack

ఇంటర్‌నెట్ డెస్క్: లండన్‌లో దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఓ భారతీయ యువకుడు కత్తి దాడిలో ప్రాణాలు కోల్పోయాడు. మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బుధవారం పశ్చిమ లండన్‌లోని సౌత్‌ఆల్‌లో గుర్తు తెలియని వ్యక్తులు గుర్‌భేజ్ సింగ్ అనే భారతీయుడితో పాటు మరో వ్యక్తిపై కత్తితో దాడి చేశారు. ఈ దాడిలో ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు, అంబులెన్స్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అంబులెన్స్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు.


అంబులెన్స్ సిబ్బంది గుర్‌భేజ్‌కు ప్రాథమిక చికిత్స అందించి, అక్కడినుంచి తరలించే ప్రయత్నం చేశారు. అయితే, గుర్‌భేజ్ సంఘటనా స్థలంలోనే ప్రాణాలు విడిచాడు. అంబులెన్స్ సిబ్బంది గాయపడ్డ మరో వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. హత్యతో సంబంధం ఉందన్న అనుమానంతో పోలీసులు ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించారు. వారికి హత్యతో ఎలాంటి సంబంధం లేదని తెలియటంతో విడుదల చేశారు. పోలీసులు నిందితులను గుర్తించే పనిలో పడ్డారు. ప్రత్యక్ష సాక్షులు, వీడియో ఆధారాలు ఉన్న వారు తమను సంప్రదించాలని కోరారు.


ఇవి కూడా చదవండి

ఆసియా క్రీడలకు సింధు, సాత్విక్‌

ఎడారి పండు... ఎన్ని రకాలో...

Updated Date - Jun 14 , 2026 | 09:42 AM