Share News

ట్రంప్‌ కొత్త సుంకాలపై 25 రాష్ట్రాల కేసు!

ABN , Publish Date - Aug 05 , 2026 | 06:07 AM

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఇటీవల విధించిన కొత్త సుంకాలు కూడా న్యాయపరమైన చిక్కుల్లో పడ్డాయి. వెట్టి చాకిరీతో ముడిపడి ఉన్న వస్తువులు/సరుకుల దిగుమతిని తగ్గించే పేరుతో..

ట్రంప్‌ కొత్త సుంకాలపై 25 రాష్ట్రాల కేసు!

60 దేశాలపై విధించిన టారి్‌ఫలను తప్పుబడుతూఅమెరికా అంతర్జాతీయ ట్రేడ్‌ కోర్టులో ఉమ్మడిగా పిటిషన్‌

వాషింగ్టన్‌, ఆగస్టు 4: అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఇటీవల విధించిన కొత్త సుంకాలు కూడా న్యాయపరమైన చిక్కుల్లో పడ్డాయి. వెట్టి చాకిరీతో ముడిపడి ఉన్న వస్తువులు/సరుకుల దిగుమతిని తగ్గించే పేరుతో విధించిన సుంకాలను తప్పుపడుతూ.. అమెరికాలోని 25 రాష్ట్రాలు కూటమిగా ఏర్పడి అమెరికా ‘అంతర్జాతీయ వాణిజ్య కోర్టు’లో పిటిషన్‌ దాఖలు చేశాయి. అమెరికా దిగుమతుల్లో 99.4ు ఈ 60 దేశాల నుంచి వస్తున్నాయని గుర్తు చేశాయి. ఏ దేశంపై అయినా ఇష్టానుసారం టారి్‌ఫలు విధించే అధికారం అధ్యక్షుడికి లేదని పేర్కొన్నాయి. అమెరికా వాణిజ్య ప్రతినిధి కార్యాలయం కేవలం 3రకాల ఉత్పత్తులను మాత్రమే వెట్టిచాకిరీతో ముడిపడి ఉన్నట్టుగా గుర్తించిందని.. అందుకు విరుద్ధంగా 60 దేశాలకు చెందిన అన్ని రకాల ఉత్పత్తులపై సుంకాలు వేయడం చట్టవిరుద్ధమని స్పష్టం చేశాయి.

ఇవి కూడా చదవండి..

ఇజ్రాయెల్‌కున్న గొప్ప స్నేహితుల్లో మోదీ ఒకరు: బెంజమిన్ నెతన్యాహు

ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట.. విచారణ అనంతరం విడుదల చేయాలని మద్రాస్ హైకోర్టు ఆదేశం..

Updated Date - Aug 05 , 2026 | 06:07 AM