కెనడాలో భారతీయ యువతి దారుణ హత్య..
ABN , Publish Date - May 28 , 2026 | 01:44 PM
కెనడాలో దారుణం చోటుచేసుకుంది. భారతీయ యువతిని గుర్తు తెలియని వ్యక్తి అతి కిరాతకంగా హత్య చేశాడు. కత్తితో పొడిచి ప్రాణాలు తీశాడు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఇంటర్‌నెట్ డెస్క్: కెనడాలో దారుణం చోటుచేసుకుంది. భారతీయ యువతిని గుర్తు తెలియని వ్యక్తి అతి కిరాతకంగా హత్య చేశాడు. కత్తితో పొడిచి ప్రాణాలు తీశాడు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. గుజరాత్, ఆనంద్ జిల్లాలోని బోర్సద్‌కు చెందిన 22 ఏళ్ల విధి కల్పేశ్ భాయ్ మేఘానీ ఉన్నత చదువుల నిమిత్తం నాలుగేళ్ల క్రితం కెనడా వెళ్లింది. ఓ వైపు చదువుతూనే మరో వైపు పార్ట్ జాబ్ చేస్తోంది. ఎంతో సాఫీగా సాగిపోతున్న ఆమె జీవితంలో ఊహించని ఘోరం చోటుచేసుకుంది.
మే 15వ తేదీన గుర్తు తెలియని వ్యక్తి ఆమెపై కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్ర గాయాలపాలైన విధి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితుడు విధిని ఎందుకు చంపాడన్న సంగతి తెలియరాలేదు. పోలీసులు నిందితుడి కోసం అన్వేషిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
రూ.2 కిలో బియ్యం పథకం స్ఫూర్తితోనే అన్నా క్యాంటీన్లు: పవన్ కల్యాణ్